టాలీవుడ్ లో పెద్ద హీరోలు.. పాన్ ఇండియా స్టార్స్ చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కీర్తి తెచ్చిపెడుతున్న హీరోలు ఉన్నారు. బారీ బడ్జెట్ సినిమాలతో టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ ను చేరింది. ఇక ఎంత ఎదిగినా సరే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఏదో ఒక సందర్భంలో లేడీ గెటప్ వేయక తప్పదు. అంతెందుకు రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప2 లో చీరకట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అమ్మవారి వేశంలో బన్నీని చూసిన ఆడియన్స్, అల్లు ఫ్యాన్స్ పనకంతో ఊగిపోయారు. ఇలా స్టార్స్ అంతా ఏదో ఒక రకంగా లేడీ గెటప్ వేసినవారే.
ఇక ఆ కాలంలో కూడా ఈ గెటప్ లు తప్పలేదట సీనియర్ హీరోలకు. తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లుగా నిలిచిన ఎన్టీఆర్ ఏఎన్నార్ లు కూడా లేడీ గెటప్ లో సందడి చేశారు. ఇక పెద్దాయన ఎన్టీఆర్ అయితే ఆడ వేషం వేయడంతో పాటు.. ఓ డ్యూయెట్ కూడా పాడుకున్నారట. అది కూడా ఓ కమెడియన్ తో డ్యూయెట్ చూడా చేశారు.ఇంతకీ ఎన్టీఆర్ లేడీ గెటప్ వేసిన ఆ సినిమా ఏదో తెలుసా.. అన్నా తమ్ముడు సినిమా.
అచ్చు గుద్దినట్టుగా ఓ మహిళ, మధ్యతరగతి ఇల్లాలు ఎలా ఉంటుందో అలా కనిపించారు ఎన్టీఆర్. కొప్పు పెట్టుకుని.. అందమైన చీర కట్టుకుని, ముక్కు పుడకతో పాటు.. మేకప్ తీర్చి దిద్దుకుని కనిపించారు ఎన్టీఆర్. ఇక అలనాటి స్టార్ కమెడియన్ రేలంగితో కలిసి డ్యూయోట్ కూడా పాడుకున్నారు. ఈ పాట అప్పట్లో చాలా హైలెట్ అయ్యింది. ఇప్పుడు చూసినా.. ఎన్టీఆర్ నటనకు జోహార్ అనకుండా మానరు.
రీసెంట్ గా ఈ పాటకు సబంధించిన ఓ రీల్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నటన విషయంలో పెద్దాయన తరువాత ఎవరైనా.. ఎంత అందంగా ఉన్నారో లేడీ గెటప్ లో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు ఎంత అద్భుతంగా నటించారు.. ఏ పాత్ర అయినా ఎన్టీఆర్ తరువాతే అంటూ.. తెగ ముచ్చటపడుతున్నారు నందమూరి ఫ్యాన్స్.
దారవీరశూరకర్ణ సినిమాలో మూడు పాత్రల్లో మెప్పించారు ఎన్టీఆర్. ఆ కాలంలో ఈ సినిమాకు ఎలాంటి టెక్నిక్స్ వాడారో తెలియదు కాని.. అంత అద్భుతంగా సినిమాను ఎవరు చేయలేకపోయారు అని చెప్పాలి. రాముడిగా కృష్ణుడిగా, దుర్యోధనుడిగా , అర్జునుడిగా, కర్ణుడిగా, వీర బ్రహ్మేంద్రస్వామిగా, వేమనగా, ఆది శంకరుడిగా, రామానుజుడిగా.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే..సీనియర్ ఎన్టీఆర్ చేసినన్న పాత్రలు ఎవరు చేసి ఉండరేమో.
అంతే కాదు.. ప్రతీ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశాం చేసేవారు. ఎవరికి సాధ్యం కాని నటన ఆయనలో కనిపించేది. అటు మైథలాజికల్ క్యారెక్టర్ లు మాత్రమే కాదు.. ఇటు సోషల్ మూవీస్ కూడా అంతే అద్భుతంగా చేసిన ఎన్టీఆర్ .. కమర్షియల్ సినిమాలతో నిర్మాతలకు కాసులు కురిపించారు. హీరోగా మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కూడా ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.