BookMyShow, Pushpa 2: The Rule, KALKI, DEVARA
BookMyShow వారి ఇయిర్ ఎండ్ రిపర్ట్ ను #BookMyShowThrowback పేరుతో విడుదల చేసింది. 2024 సంవత్సరంలో దేశంలో అతి పెద్ద రిలీజ్ లుగా పుష్ప 2, దేవర, కల్కి, ఫైటర్, స్ట్రీ 2, సింగం ఎగైన్, మరియు భూల్ భూలయ్యా 3తో సహా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఎక్కువ ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ ఉన్న విడుదలలు జరిగాయి. అయితే, వీటిలో ఏ సినిమా బుక్ మై షోలో ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యింది అనేది ఆసక్తికరమైన విషయం.
allu arjun movie Pushpa 2
అతి త్వరలో 2024 వెళ్లిపోతోంది. 2025 కు స్వాగతం పలకనుంది ప్రపంచం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ఈ ఏడాదిలో చాలా చిత్రాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.
actor allu arjun movie pushpa 2
అయితే ఈ లిస్ట్ లో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. అదే సమయంలో తాజాగా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో అఫీషియల్ గా వెల్లడించింది. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్ చూసినట్లు చెప్పుకొచ్చింది.
భారతీయ సినీ చరిత్రలో కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతోంది ‘పుష్ప2: ది రూల్’ (Pushpa 2: The Rule). 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా కనిపించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1508 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టే విషయంలో ‘పుష్పరాజ్’ వాయువేగంతో దూసుకుపోతున్నాడు.
actor allu arjun movie pushpa 2 the rule
‘పుష్ప2: ది రూల్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1,508 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ‘కేజీయఫ్2’ (రూ.1250 కోట్లు), ‘RRR’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా వెళ్తోంది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రాల జాబాతాలో ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ (రూ.2,024 కోట్లు) టాప్‌లో ఉంది. ముంబయి సర్క్యూట్‌లో రూ.200 కోట్లు (నెట్) సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ‘పుష్ప 2’ హిందీలో రూ.618.50 కోట్లు (నెట్) వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.