ఒక్కడు, పోకిరి చిత్రాలకు తేడా తెలియదా.. తన కామెంట్స్ తో నవ్వులపాలైన రష్మిక

First Published | Dec 21, 2024, 7:25 AM IST

పుష్ప 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని రష్మిక ఎంజాయ్ చేస్తోంది. పుష్ప పార్ట్ 2, పార్ట్ 2 రెండు భాగాల్లోనూ రష్మిక హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం రష్మిక..సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తోంది. 

పుష్ప 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని రష్మిక ఎంజాయ్ చేస్తోంది. పుష్ప పార్ట్ 2, పార్ట్ 2 రెండు భాగాల్లోనూ రష్మిక హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం రష్మిక..సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా నటిస్తోంది. 

రీసెంట్ గా రష్మిక ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కి కారణం అయ్యాయి. ఆ కామెంట్స్ తో రష్మిక నవ్వులపాలు అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే రష్మిక మాట్లాడుతూ తాను థియేటర్ లో చూసిన మొట్ట మొదటి చిత్రం గిల్లీ అని తెలిపింది. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. 


Ghilli

అయితే ఆ టైంలో ఈ మూవీ రీమేక్ చిత్రం అని రష్మికకి తెలియదట. రీసెంట్ గానే తెలిసింది గిల్లీ చిత్రం మహేష్ బాబు పోకిరి చిత్రానికి రీమేక్ అని అంటూ రష్మిక కామెంట్స్ చేసింది. చాలా కాన్ఫిడెంట్ గా పోకిరి రీమేక్ అని చెప్పింది. అక్కడే రష్మిక తప్పులో కాలేసింది. వాస్తవానికి గిల్లీ.. పోకిరి రీమేక్ కాదు. ఒక్కడు చిత్రానికి రీమేక్. 

Ghilli Movie

దీనితో నెటిజన్లు రష్మికపై ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. ఒక్కడు, పోకిరి చిత్రాలకు తేడా తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గిల్లీ చిత్రంలో విజయ్ సార్, త్రిష మేడమ్ పెర్ఫామెన్స్ కి ఫిదా అయ్యాను అని రష్మిక తెలిపింది. 

ట్విస్ట్ ఏంటంటే పోకిరి చిత్రాన్ని కూడా విజయ్ తమిళ్ లో అదే టైటిల్ తో రీమేక్ చేసారు. బహుశా అందుకే త్రిష కన్ఫ్యూజ్ అయినట్లు ఉంది. అయితే పోకిరి రీమేక్ లో హీరోయిన్ గా ఆసిన్ నటించింది. చాలా తెలుగు చిత్రాలని విజయ్ తమిళంలో రీమేక్ చేశారు. పవిత్ర బంధం, పెళ్లి సందడి చిత్రాలని కూడా విజయ్ రీమేక్ చేయడం విశేషం. 

Latest Videos

click me!