తొలిసారి శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ కి ఊహించని ఎదురుదెబ్బ.. ఆ తర్వాత అంతా ఆయన కాళ్లపై పడేలా అద్భుతం

First Published | Dec 21, 2024, 8:44 AM IST

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే తెలుగు వారు ముందుగా ఊహించుకునే రూపం నందమూరి తారక రామారావు. ఎన్నో చిత్రాల్లో ఆయన రాముడిగా, కృష్ణుడిగా నటించి చెరగని ముద్ర వేశారు. కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ఆహార్యం, డైలాగ్ చేప్పే విధానం అద్భుతంగా ఉంటుంది.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే తెలుగు వారు ముందుగా ఊహించుకునే రూపం నందమూరి తారక రామారావు. ఎన్నో చిత్రాల్లో ఆయన రాముడిగా, కృష్ణుడిగా నటించి చెరగని ముద్ర వేశారు. కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ఆహార్యం, డైలాగ్ చేప్పే విధానం అద్భుతంగా ఉంటుంది. అయితే ఎన్టీఆర్ కృష్ణుడిగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కాలేదు. తీవ్ర విమర్శలు ఎదురుకొన్నారు అని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కృష్ణుడు, రాముడు పాత్రలతో ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు నిజంగానే ఆరాధ్య దైవం గా మారారు. అలాంటిది తొలి ప్రయత్నంలో ఎందుకు విమర్శలు ఎదుర్కొన్నారో అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. సొంత ఊరు చిత్రంలో ఎన్టీఆర్ కొంతసేపు శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపించారు. ఆ గెటప్ ఎన్టీఆర్ కి ఏమాత్రం సెట్ కాలేదట. దీనితో తీవ్ర విమర్శలు వచ్చాయి. అపహాస్యం చేసిన వారు కూడా ఉన్నారు. 


ఆ తర్వాత మాయా బజార్ చిత్రంలో ఎన్టీఆర్ కి మరోసారి కృష్ణుడిగా ఫుల్ లెన్త్ పాత్రలో ఛాన్స్ వచ్చింది. మాయాబజార్ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ తన నటనతో కట్టి పడేశారు. ఎన్టీఆర్ ని పౌరాణిక చిత్రాల్లో ఆదరించడం మొదలు పెట్టింది ఈ చిత్రం నుంచే. అయితే ఆ మార్పు ఎలా సాధ్యం అయింది.. మొదటి కృష్ణుడిగా ఫెయిల్యూర్ ఆ తర్వాత సక్సెస్.. ఇది ఎలా సాధ్యం అయింది అని రాజేంద్ర ప్రసాద్ ఒక సందర్భంలో ఎన్టీఆర్ ని దిగారట. 

అప్పట్లో మాధవ్ పెద్ది గోఖలే అనే ఆర్ట్ డైరెక్టర్ ఉండేవారట. ఎన్టీఆర్ ధరించే కిరీటాన్ని అందంగా తీర్చిదిద్దారట. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసింది ఆయనే. కిరీటాన్ని ఎంతో కష్టపడి డిజైన్ చేశారట. కిరీటం డిజైన్ ని ఎన్టీఆర్ చివరి వరకు దాచుకున్నారు. పేపర్ పై గీసిన కిరీటం స్కెచ్ ని ఎన్టీఆర్ గారు నాకు చూపించారు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 

ఎన్టీఆర్ తనని తాను మార్చుకుని మాయా బజార్ చిత్రంలో నటించారు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ నిజంగానే దేవుడు అని భావిస్తూ ఆయన కాళ్లపై పడి మొక్కేవారట. విమర్శించిన వారే అభినందించారు. అంతా తనకి మొక్కుతుండడంతో తనలో కూడా ఆధ్యాత్మిక భావాలు మొదలయ్యాయి అని ఎన్టీఆర్ తెలిపారు. అప్పటి నుంచి తనని తాను మేము అని సంబోధిస్తూ ఇతరులని మీరు అని సంబోధించడం ప్రారంభించారు అని ఎన్టీఆర్ గురించి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 

Latest Videos

click me!