మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అందరికి చాలా గౌరవం. ఆయనతో మాట్లాడటానికే భయపడేవారు ఉన్నారు. చిరంజీవి మాత్రం అందరిని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఈక్రమంలోనే ఓ హీరోయిన్ చిరంజీవిని డిమాండ్ చేసి మరీ.. ఆయన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారట.
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్స్, నటనతోనే కాకుండా.. మంచి మనిషిగా, మంచి లీడర్ గా, ఇండస్ట్రీలో అందరికి ఆత్మీయుడిగా ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. సెట్స్‌లో తోటి నటీనటులను ఆప్యాయంగా చూసుకోవడం, వారి అవసరాలను గమనించడం ఆయన సహజ లక్షణం. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన ఇంటి భోజనం గురించి, ముఖ్యంగా హీరోయిన్ కీర్తి సురేష్‌కు తాను పంపిన వంటకాల గురించి చాలా సరదాగా చెప్పి అందరిని నవ్వించారు.
24
హైదరాబాద్‌లో ఫుడ్ బాగోలేదని అడిగిన కీర్తి సురేష్
ఈ సంఘటన మొదలు కావడానికి గల కారణాన్ని చిరంజీవి తనమార్క్ కమెడీతో వివరించారు. బోళా శంకర్ సినిమా షూటింగ్ టైమ్ లో కీర్తి సురేష్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తనకు ఇక్కడ ఆహారం సరిగ్గా కుదరడం లేదని చెప్పారట. ఆ మాట విన్న చిరంజీవి, "ఇంటి ఫుడ్ పెట్టలేదు కానీ, ఎందుకంటే తను అడిగేది కదా మంచిగా... ఈ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్‌లో నాకు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు అని అడగొచ్చు కదా, మీరు పంపించండి ఫుడ్ అని... పంపిస్తాను కదా" అంటూ .. మెగాస్టార్ తన మంచితనం చాటుకున్నారు.
34
"ఇదేమైనా హోటల్ అనుకున్నావా నువ్వు?"
ఈ భోజనాల వ్యవహారంలో అసలైన సరదా ట్విస్ట్ తర్వాత వచ్చింది. చిరంజీవి ఇంటి నుంచి వెళ్లిన వంటలను తిన్న కీర్తి సురేష్, "భలే ఉంది అది, బాగుంది... కానీ అది కొంచెం తగ్గింది, ఏదైనా కొంచెం సెట్ చేసి మళ్లీ కరెక్ట్ చేసి పంపించండి" అని ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారట. అంతే కాకుండా.. రేపు ఏం తీసుకొస్తున్నారు సర్ అని డిమాండ్ చేసి అడిగేదట కీర్తి. దాంతో ఆ మాటలు విన్న చిరంజీవికి సరదాగా . "ఏంటి ఇది, హోటల్ అనుకుంటున్నావా నువ్వు? కరెక్ట్‌గా లేదని పెద్ద డిమాండ్ వేయడానికి?" అంటూ సరదాగా మందలించారట. అయినా సరే, మరుసటి రోజు ఏం పంపిస్తున్నారని ఆరా తీసేదట కీర్తి సురేష్. భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. మోహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈసినిమా డిజాస్టర్ గా నిలిచింది.
అప్పటి నుంచి చిరంజీవి ఇంటి నుంచి కీర్తి సురేష్‌కు కావాల్సిన ఫుడ్ క్యారియర్ పంపించడం మొదలైందట . తమ ఇంట్లో తమిళ కుక్ ఉన్నాడని.. దాంతో తమిళ వంటకాలైనా, తెలుగు వంటకాలైనా రోజూ తప్పకుండా పంపించేవారమని చిరంజీవి తెలిపారు ముఖ్యంగా వెజిటేరియన్‌లో ఎన్నో రకాల వెరైటీలను కీర్తి సురేష్ ప్రతిరోజూ అడిగేవారట . "వెజిటేరియన్‌లో ఏముంటే అవి చాలా వెరైటీలు ప్రతిరోజూ డిమాండ్ చేసి మరీ తెప్పించుకునేదట. ఈ విషయాలను చిరంజీవి నవ్వుతూ చెప్పారు.
కుక్‌ని అడిగి మరీ వంటలు పంపిన వైనం
తన కోసం ఎప్పుడూ ప్రత్యేకంగా ఏదైనా వండి పెట్టమని అడగని చిరంజీవి, కీర్తి సురేష్ కోసం మాత్రం కుక్‌తో మాట్లాడి వంటలు చేయించేవారట. ఆతమిళ కుక్ కూడా చిరంజీవికి ఏం కావాలి అని అడగడం మానేసి.. మధ్యాహ్నం సమయంలో వచ్చి "సార్, కీర్తి సురేష్‌కు ఇవాళ ఏం పంపాలి సార్?" అని అడిగేవాడట]. దానికి చిరంజీవి, "ఏమైనా వండి పంపు తోలయ్యా" అని సరదాగా అనేవారట. అప్పుడు కుక్ కొన్ని వంటకాల పేర్లు చెప్పేవాడని, వాటిని తయారు చేసి పంపించేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.