నటి పూజిత పొన్నాడ ఆదర్శకుటుంబం మూవీపై సంచలన ఆరోపణలు చేసింది. ఒక్క సీన్ కోసం తనని వాడుకున్నారు అని ద్రోహం చేశారు అని కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ మూవీ ఆదర్శ కుటుంబం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ పై విమర్శలు మొదలయ్యాయి. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో భారీ పాన్ ఇండియా చిత్రం చేయాల్సి ఉంది. కానీ ఆదర్శకుటుంబం రిజల్ట్ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఇబ్బందులన్నింటికీ తోడు తాజాగా ఓ నటి త్రివిక్రమ్ పై, ఆదర్శకుటుంబం మూవీపై ఆరోపణలు చేసింది.
25
నటి పూజిత పొన్నాడ కామెంట్స్
ఆ నటి ఎవరో కాదు.. రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి ప్రేయసిగా నటించిన పూజిత పొన్నాడ. రంగస్థలంలో ఆమెని చిన్న పాత్రే అయినప్పటికీ కథ మలుపు తిరిగేది ఆమె పాత్రతోనే. చాలా సినిమాల్లో ఆమె చిన్న పాత్రల్లో మెరిశారు. హరిహర వీరమల్లు మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజిత ఆదర్శ కుటుంబం మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
35
మంచి ఛాన్స్ దొరికింది అనుకున్నా
ఆదర్శకుటుంబం చిత్రంలో నాకు అవకాశం దక్కింది. నేను యుకెలో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి సినిమా గురించి చెప్పారు. త్రివిక్రమ్ గారి సినిమా అనగానే చాలా సంతోషించా. ఆడిషన్స్ కి రమ్మన్నారు. వెంటనే హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను. వివిధ రకాల ఫోటో షూట్స్ కూడా చేశారు. త్రివిక్రమ్ గారు చూసి ఫైనల్ చేసి నన్ను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఒకటిన్నర గంట నాకు కథ నేరేషన్ ఇచ్చారు. నా రోల్ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ఇంత మంచి పాత్ర దొరకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఈ రోల్ కోసం మీలాంటి పర్సనాలిటీ ఉన్న నటి కోసమే వెతుకుతున్నాం అని చెప్పారు.
మొత్తానికి షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ లోనే నన్ను షూటింగ్ కి పిలిచారు. ఆ తర్వాత మూడు నెలల పాటు సెకండ్ షెడ్యూల్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంతలో చాలా రూమర్స్ విన్నాను. కథలో మార్పులు జరుగుతున్నాయి అని.. చాలా మందిని ఛేంజ్ చేస్తున్నారు అని తెలిసింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కి ఫోన్ చేశా. నా రోల్ ఏమైనా తగ్గించారా అని అడిగా. మీ పాత్ర పెరగడమే ఉంటుంది కానీ తగ్గడం అయితే ఉండదు. త్రివిక్రమ్ గారు మీ రోల్ ఇంకా బాగా రాస్తున్నారు అని చెప్పారు. ఆ తర్వాత కూడా షూటింగ్ కోసం నాకు పిలుపు రాలేదు.
55
ఒక్క సీన్ కోసం వాడుకున్నారు, ద్రోహం ఇది
ఆ టైంలో నాకు విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉంది. నేను విదేశాల్లో ఉన్నప్పుడు షూటింగ్ మొదలైతే ఇబ్బంది అవుతుంది అని, ఒకసారి క్లారిటీ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ కి ఫోన్ చేశాను. రెస్పాండ్ కాలేదు. మరో అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు. మేడం మన షూటింగ్ లేదు అని అన్నారు. మన షూటింగ్ లేదు అంటే అర్థం ఏంటి.. క్లియర్ గా చెప్పండి అని అన్నాను. మీ రోల్ లోకి మరో నటిని తీసుకున్నారు అని చెప్పారు. అసలు ఇది ఎంత ద్రోహం ? ఒక ప్రాసెస్ ప్రకారం నన్ను ఎంపిక చేశారు. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా తొలగించారు. సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే మరో షాక్. ఒక సీన్ లో నేను ఉన్నాను. కానీ నేను ఉన్నట్లు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఒక్క సీన్ కోసం నన్ను వాడుకున్నారు అంటూ పూజిత ఆదర్శకుటుంబం మూవీపై ఆరోపణలు చేసింది.