Nayanthara Net Worth: నయనతార పుట్టినరోజు, విఘ్నేష్‌ శివన్‌ అదిరిపోయే పోస్ట్.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే?

Published : Nov 19, 2026, 10:25 AM IST

Nayanthara Net Worth: తమిళ చిత్రసీమలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార తన 42వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణం, ఆస్తుల విలువ గురించి ఓసారి చూద్దాం.

PREV
16
నయనతార 42వ పుట్టినరోజు

నయనతార బుధవారం తన 42వ పుట్టినరోజుని సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ స్పెషల్ డే సందర్భంగా ఇండియన్ సినిమా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. 20 ఏళ్లకు పైగా సాగిన ఆమె సినీ ప్రయాణంలో 75కి పైగా సినిమాల్లో నటించింది. సౌత్ సినిమాలో హీరోయిన్లకు ఉన్న స్టార్ వ్యాల్యూను ఆమె పూర్తిగా మార్చేసింది.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే థియేటర్లలో మాస్ ఓపెనింగ్స్, అభిమానుల హంగామా ఉంటాయి. కానీ, ఒక హీరోయిన్‌గా తన సినిమాలకు కూడా అంతే రేంజ్‌లో బాక్సాఫీస్ కలెక్షన్లు తీసుకురాగలనని ఆమె నిరూపించింది. మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయనతార, తమిళంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని 'లేడీ సూపర్ స్టార్' బిరుదు సొంతం చేసుకుంది.

26
తమిళ్ ఆడియన్స్‌ను మెప్పించిన తొలి ఎంట్రీ

నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. 1984 నవంబర్ 18న బెంగళూరులో జన్మించింది. 2003లో సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన 'మనస్సినక్కరే' అనే మలయాళ చిత్రంతో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2005లో తమిళ సినిమాల్లోకి ఆమె ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జరిగింది. హరి దర్శకత్వంలో శరత్‌కుమార్ సరసన 'అయ్యా' సినిమాలో నటించి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన సహజ నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకుంది.

అదే ఏడాది పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి'లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది నయనతార. ఆ తర్వాత ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'గజిని'లో ఆమె డిఫరెంట్ యాక్టింగ్ ఆమెకు పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది.

36
గ్లామర్ నుంచి సీరియస్ రోల్స్‌కు

2000ల చివర్లో నయనతార తన నటనతో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, పక్కింటి అమ్మాయి లాంటి సహజమైన క్యారెక్టర్లలో కూడా అదరగొట్టింది. అజిత్ కుమార్ నటించిన 'బిల్లా' (2007)లో నయనతార స్టైలిష్, యాక్షన్ లుక్ తమిళ సినిమా హీరోయిన్ల పాత ఇమేజ్‌ను బద్దలుకొట్టింది.

ఆ తర్వాత వచ్చిన 'యారడి నీ మోహిని' (2008), 'బాస్ ఎంగిర భాస్కరన్' (2010), 'రాజా రాణి' (2013) లాంటి హిట్స్ ఆమెను ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ హీరోయిన్‌గా మార్చేశాయి. రజనీకాంత్‌తో 'దర్బార్', విజయ్‌తో 'విల్లు', 'బిగిల్', అజిత్‌తో 'ఆరంభం', 'విశ్వాసం', సూర్యతో 'ఆదవన్', 'మాస్' లాంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించినా.. తనదైన క్యారెక్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నయన్ ఎప్పుడూ సక్సెస్ అయింది.

46
బాక్సాఫీస్ దగ్గర కొత్త ట్రెండ్

మిగతా హీరోయిన్ల కంటే నయనతారను ప్రత్యేకంగా నిలబెట్టేది.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను బాక్సాఫీస్ వద్ద హిట్ చేయగల ఆమె స్టామినానే. 2010ల మధ్య నుంచి కేవలం హీరోల మీద ఆధారపడకుండా, తన సొంత ఇమేజ్‌తో సినిమాలను హిట్ చేయడానికి ఆమె ఎంతో కష్టపడింది.

మాయ (2015): తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్, నయనతార స్టార్ డమ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అరమ్ (2017): కలెక్టర్‌గా నటించిన నయన్, నీటి సమస్య, అధికారుల నిర్లక్ష్యంపై పోరాడే ధైర్యవంతమైన ఆఫీసర్‌గా మెప్పించింది. ఈ నటనకు ఆమెకు బెస్ట్ ఆక్ట్రెస్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది.

కోలమావు కోకిల, ఇమైక్కా నొడిగల్ (2018): కొన్ని వారాల గ్యాప్‌లో వచ్చిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత 'ముక్కుతి అమ్మన్' (2020), 'నెట్రికన్' (2021) లాంటి సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుని థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ తన సత్తా చాటింది.

56
నిర్మాతగా, బిజినెస్ వుమన్‌గా

తమిళ సినిమాలోనే కాకుండా, తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నయనతారకు అభిమానులు ఉన్నారు. తెలుగులో 'శ్రీరామరాజ్యం', 'సైరా నరసింహారెడ్డి' అలాగే మలయాళంలో 'పుతియ నియమం' లాంటి సినిమాలతో ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2023లో అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టింది.

2026లో ఇటీవల పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'తో పాటు సుందర్ సి దర్శకత్వంలో 'ముక్కుతి అమ్మన్ 2'లో డబుల్ యాక్షన్‌లో కనిపించింది మెప్పించింది. సినిమాను దాటి బిజినెస్‌లో కూడా అడుగుపెట్టిన నయన్, 'రౌడీ పిక్చర్స్' ద్వారా నిర్మాతగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, '9Skin', 'Femi9' లాంటి బ్రాండ్స్‌తో బిజినెస్ వరల్డ్‌లో కూడా తన మార్క్ చూపిస్తోంది.

66
నయనతార ఆస్తుల విలువ

42వ పడిలో అడుగుపెడుతున్న నయనతార సినీ ప్రయాణం నిజంగా చాలా మందికి పెద్ద ఇన్స్పిరేషన్. సాధారణంగా సినిమాలోకి వచ్చిన ఆమె.. తన కష్టం, టాలెంట్, సరైన కథల ఎంపికతో 20 ఏళ్లుగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.223 కోట్లు ఉంటుందని సమాచారం.

ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర హీరోయిన్లకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ, ఆ రూల్‌ను బ్రేక్ చేసిన నయనతార.. ఈ రోజు తన పేరుతోనే ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే స్థాయికి ఎదిగింది. అందుకే ఆమె కేవలం పాపులర్ నటి మాత్రమే కాదు; ఇండియన్ సినిమాలో 'లేడీ సూపర్ స్టార్' అనే పదానికి అసలైన అర్థం చెప్పిన అరుదైన తార.

ఇక నయనతార పుట్టిన రోజు సందర్భంగా భర్త విఘ్నేష్‌ శివన్‌ స్పెషల్‌ పోస్ట్ ని పంచుకున్నారు. ఆమెతో ఉన్న అరుదైన ఫోటోలను షేర్‌ చేశారు. తన సంతోషాన్ని తెలియజేశారు. అదే సమయంలో తన భార్యకి ప్రత్యేకమైన బర్త్ డే విషెస్‌ని వెల్లడించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories