సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రిన్స్ అని మరో పేరు ఉంది. ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. అటువంటి హీరోను అన్నయ్య అని ఎవరైనా పిలవగలరా..? కానీ ఓ హీరోయిన్ మాత్రం సూపర్ స్టార్ ను అన్నా అని పిలిచిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్... నిజమెంత.?
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు మహిళా అభిమానులు ఎక్కువ. ప్రిన్స్ అని మహేష్ ను ముద్దుగా పిలుచుకుంటారు. మహేష్ ను చూస్తే చాలు అనుకునే లేడీ అభిమానులు ఉన్నారు. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. స్టార్ హీరోయిన్లు ఎందరో మహేష్ బాబుతో కలిసి జంటగా నటించాలని ఆశపడ్డారు. మహేష్ తో సినిమా అవకాశం కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. అటువంది హ్యాండ్సమ్ స్టార్ ను.. అన్నయ్య అని పిలిచిన హీరోయిన్ గురించి మీకు తెలుసా?
25
వారసత్వంగా ఎంట్రీ ఇచ్చి..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలోకి కృష్ణ నట వారసత్వంతో అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడిగా నిలిచారు. కెరీర్ ప్రారంభంలోనే భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ, కమర్షియల్ ఆడియన్స్ కూడా ఆకట్టుకున్నారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ.. సినిమాలు, కథలు, దర్శకులు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
35
మహేష్ బాబును అన్న అని పిలిచిన హీరోయిన్
ఇదిలా ఉండగా, మహేష్ బాబుతో నటించే అవకాశం కోసం చాలా మంది హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. ఆయనకు పెళ్లి జరిగినప్పుడు కూడా చాలా మంది మహిళా అభిమానులు చాలా ఎమోషనల్ అయ్యారు.. ఇప్పటికీ మహేష్ ను పిచ్చిగా ప్రేమించే అభిమానులు ఉన్నారు.. ఈక్రమంలో మహేష్ బాబును ఓ హిరోయిన్ అన్నయ్య అని పిలిచిందట.
ఆమె ఎవరో కాదు దివంగత తార ఆర్తీ అగర్వాల్. మహేష్ బాబుతో కలిసి బాబీ సినిమాలో నటించిన ఆర్తీ అగర్వాల్. షూటింగ్ ప్రారంభ సమయంలోనే మహేష్ బాబును చూసిన వెంటనే ఆమె “అన్న” అని పిలిచినట్లు తెలుస్తోంది. ఈ పిలుపుతో మహేష్ బాబు తో పాటు.. చుట్టు ఉన్నవారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసినట్టు సమాచారం.
ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అయ్యింది. అయితే గతంలో హీరోయిన్ శ్రీదివ్య కూడా మహేష్ ను అన్నా అని పిలిచినట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మహేష్ బాబు తో ఓ మూవీలో నటించింది. అప్పుడు మహేష్ ను అన్నా అని పిలిచిందట. శ్రీదివ్య తరువాత మహేష్ ను అన్నా అని పిలిచింది ఆర్తీనే అని టాక్.
55
పాన్ వరల్డ్ మూవీతో మహేష్ బిజీ..
మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి ‘వారణాసి’ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి ఆయన ఎంటర్ అవ్వబోతున్నాడు. ఈ చిత్రాన్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి.. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మహేష్ బాబుకు జోడిగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.