హీరోగా సినిమాలు మానేసిన తరువాత డిపరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది శ్రీకాంత్ కు. అందులో భాగంగానే రామ్ చరణ్ కు అల్లు అర్జున్ కు చెరో సినిమాలో బాబాయ్ పాత్ర చేసి మెప్పించాడు శ్రీకాంత్. అల్లు అర్జున్ తో అయితే సరైనోడు సినిమాలో బాబాయ్ గా నటించాడు.
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈసినిమాలో టెంపర్ ఎక్కువగా ఉండే యంగ్ స్టార్ గా అల్లు అర్జున్ కనిపిస్తాడు.. అతన్ని కంట్రోల్ చేస్తూ.. కొన్ని సందర్భాల్లో ఎంకరేజ్ చేస్తూ...కన్న బిడ్డలా చూసుకునే బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ కనిపించాడు. ఈసినిమాలో వీళ్ళిద్దరి బాండింగ్ అద్భుంగా ఉంటుంది.