నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి ఊపు మీద ఉన్నారు. అఖండ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన ఆయన.. గత సినిమాలతో ఆ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య 108 సినిమాలలో నటించారు వరుసగా సినిమాలతో సక్సెస్ మంత్రం జపిస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో సందడి చేసిన బాలకృష్ణ.. ఈమధ్యలో కొంత తడబడ్డాడు. కాని అఖండ ఇచ్చిన ఊపుతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలకృష్ణ.