శోభన్‌బాబుపై అందరి ముందే అరిచిన నిర్మాత.. సెట్‌లో హీరోయిన్‌తో ఆయన చేసిన పనికి సోగ్గాడు షాక్‌

First Published | Dec 14, 2024, 6:19 PM IST

శోభన్‌బాబు ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. కానీ ఒక్క విషయంలో ఆయనపై అందరికి కంప్లెయింట్‌ ఉండేది. ఈ విషయంలో రామానాయుడు చేసిన పనికి సోగ్గాడు షాక్‌ అయ్యారు. 
 

శోభన్‌బాబు తన కెరీర్లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలతోనే మెప్పించాడు. అందుకే ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆడవాళ్లకి గౌరవం ఇస్తూ, అలాంటి పాత్రలే చేస్తూ మెప్పించాడు. భార్యా భర్తల మధ్య అనుబంధం, గొడవలు, మరో అమ్మాయితో ప్రేమ వంటి విషయాలు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేవి. ఇంటిళ్లిపాది కలిసి చూసేలా ఆయన సినిమాలుండేవి. అలా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. 
 

శోభన్‌బాబుకి నటన పరంగా తిరుగులేదు. ఎమోషన్స్ పలికించడంలోనూ, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు చెప్పడంలో ఆయన దిట్ట. యాక్షన్‌ సినిమాలతోనూ మెప్పించారు. కానీ ఆయనలో ఉన్న పెద్ద డ్రా బ్యాక్‌ ఏంటంటే డాన్సులు. అప్పట్లో డాన్సులు చేయడం పెద్ద సవాల్‌గా ఉండేది. పైగా పెద్దగా ప్రయారిటీ ఉండేది కాదు. ఏఎన్నార్‌ డాన్సులతో ఇరగదీసేవాడు. మిగిలిన వాళ్లు ఆయనకు పోటీ ఇవ్వడం కష్టంగా మారింది. అది శోభన్‌బాబుకి కూడా ఇబ్బందిగానే మారింది. 

Tap to resize

అయితే సాంగ్‌ షూటింగ్‌లో ఆయన చాలా ఇబ్బంది పడేవారట. సరైన స్టెప్పులు వేసేవారు కాదు, దీంతో దర్శక, నిర్మాతలు తలపట్టుకోవాల్సి వచ్చేదట. ఓ నిర్మాత ఏకంగా శోభన్‌బాబుపై అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరో నిర్మాత శోభన్‌బాబు డాన్సుని తట్టుకోలేక ఏకంగా తనే వెళ్లి డాన్సు చేశాడట. ఆయన ఎవరో కాదు మూవీ మొఘల్‌ డా డి రామానాయుడు. అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కారు రామానాయుడు. 

ఆయన నిర్మాతగా ప్రారంభంలో శోభన్‌బాబుతో సినిమా చేశారు. ఓ సినిమాకి సంబంధించిన సాంగ్‌ షూటింగ్‌ శోభన్‌బాబు, వాణి శ్రీ లపై జరుగుతుంది. బృందావనం గార్డెన్‌లో పాట చిత్రీకరణ. పాట చివరి దశకు వచ్చింది. కానీ ఒక స్టెప్ దగ్గర తెగడం లేదు. కెమిస్ట్రీ కుదరడం లేదు. అప్పటికే ఐదారు టేకులు తీసుకున్నారట. అప్పట్లో అన్ని టేకులంటే చాలా ఎక్కువ. టైమ్‌ అయిపోతుంది, బడ్జెట్‌ పెరిగిపోతుందనేది నిర్మాత బాధ.

ఈ విషయం తెలిసి డి రామానాయుడు సీరియస్‌ అయ్యాడు. ఇలా తినేస్తే ఎలా అంటూ శోభన్‌బాబు, వాణి శ్రీలపై అరిచాడట. దీనికి వాణి శ్రీ రియాక్ట్ అయ్యింది. అక్కడ కూర్చొని చెప్పడం కాదు, ఇక్కడ వచ్చి చేయు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని. అంతే ఆ మాటకి రగిలిపోయిన రామానాయుడు ఏకంగా శోభన్‌బాబుని పక్కకు వెళ్లమని చెప్పి, సాంగ్‌ పెట్టించి వాణిశ్రీతో డాన్స్ చేశాడట.

టేక్‌ అయిపోయింది, అయినా ఆపడం లేదట. అలానే గిర్రున తిప్పుతున్నాడట. దీంతో భయపడిపోయిన వాణిశ్రీ.. వామ్మో ఇక ఆపు, నేను పడిపోయేలా ఉన్నా అని అరిచిందట. అప్పుడు గానీ వదల్లేదట రామానాయుడు. ఆ స్టెప్పు కూడా అదిరిపోయింది. ఇది చూసి సోగ్గాడు షాక్‌ అయ్యాడట. కాసేపు నోరెళ్లబెట్టి చూడటం ఆయన వంత అయ్యిందట.

ఈ విషయాన్ని రామానాయుడు ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు అది వైరల్‌ అవుతుంది. అయితే ప్రారంభంలో రామానాయుడు శోభన్‌బాబు, వాణి శ్రీ కాంబినేషన్‌లో `జీవన తరంగాలు` సినిమా నిర్మించారు. దీనికి తాతినేని రామారావు దర్శకుడు. ఇందులో కృష్ణంరాజు కూడా మరో పాత్రలో నటించారు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది.

ఇండియాలోని ఎక్కువ భాషల్లో సినిమాలు నిర్మించిన డి రామానాయుడు 2015లో కన్నుమూశారు. తండ్రి వారసత్వాన్ని కొడుకు సురేష్‌ బాబు కంటిన్యూ చేస్తున్నారు. సెలక్టీవ్‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. మరో అబ్బాయి వెంకటేష్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 

read more: సినిమాల్లోకి వేణు మాధవ్‌ కొడుకు, ఏం చేయబోతున్నాడు? స్టార్‌ కమెడియన్‌ ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తుంది?

also read: మహేష్ బాబు - చిరంజీవి కాంబోలో మిస్ అయిన సినిమాలు..?

Latest Videos

click me!