‘శక్తి’ సినిమా వెనుక దాగి ఉన్న అసలు నిజం

First Published | Dec 14, 2024, 6:30 PM IST

ఎన్టీఆర్ నటించిన 'శక్తి' సినిమా పరాజయం పాలైన తర్వాత, దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాల గురించి ఫిల్మ్ నగర్ లో చర్చ జరిగింది. 

Mehar Ramesh, ntr, Sakthi, Mission Impossible


ఎన్టీఆర్‌ (NTR)హీరో గా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘శక్తి’ (sakthi movie). ఇలియానా  హీరోయిన్ గా భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్‌ నిర్మించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.  సినిమా షూటింగ్‌ నుంచి విడుదలయ్యే వరకు ఓ డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లారు.సినిమా గురించి  కనీసం మీడియాకు కూడా వివరాలు తెలియజేయకుండా,  ఏదో చిన్నపాయింట్‌ విడుదల చేసి రకరకాల కథనాలు అల్లుకోనేలా చేసి ఓ రేంజి బజ్ క్రియేట్ చేసారు.

అయితే ఆ క్రేజ్ కు,బజ్ కు తగ్గట్లు సినిమా కొంచెం కూడా లేకపోవటం దెబ్బకొట్టింది.  అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ దాని ప్రభావం నుంచి తప్పుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అందులో ఒక దాని గురించి అప్పట్లో ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకోవటం జరిగింది. అదేమిటంటే..


తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఊదరగొట్టిన 'శక్తి' మాటలకందని పరాజయాన్ని మూటకట్టుకుంది. పోకిరి, మగధీరల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలనే తపనతో ఆ రెండు చిత్రాల కథల్లో కొంత కాపీ కొట్టి కథ రూపొందించుకున్నారంటూ ఇండస్ట్రీలో వ్యాఖ్యలు విన్పించాయి.

ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా రాలేదని చెప్పుకొన్నారు. నిర్మాత దర్శకలు, బయ్యర్లు... ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికీ చేదు అనుభవం కలిగించింది. అయితే ఈ సినిమా తనపై ఇంపాక్ట్ కలగ చేయలేదు అని చెప్పుకోవాల్సిన పరిస్దితి ఎన్టీఆర్ కు ఏర్పడింది.   
 

Tap to resize

Mehar Ramesh, ntr, Sakthi, Mission Impossible

 శక్తి చిత్రానికి అసలు మెహర్‌ రమేశ్‌ చెప్పిన కథ వేరే ఉందట. ‘కంత్రీ’ తర్వాత నిర్మాత అశ్వినీదత్‌ను కలిసిన మెహర్‌ రమేశ్‌ ‘మిషన్ ఇంపాజిబుల్‌’లాంటి ఓ సోషల్‌ ఫిల్మ్‌ను తీయాలనుకున్నారు. ఎన్టీఆర్‌కు కూడా అదే కథను వినిపించారు. ఇద్దరికీ బాగా నచ్చేసిందట.

ఇండస్ట్రీలో స్నేహితులైన దర్శకుడు వి.వి.వినాయక్‌,  హీరో అల్లు అర్జున్‌లకు కూడా ఈ కథ వినిపించి అభిప్రాయం తీసుకున్నారట మెహర్‌ రమేశ్‌. అందరికీ కథ నచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్‌ తన డేట్స్‌ను ముందుగా ‘బృందావనం’ కోసం కేటాయించాల్సి వచ్చింది. దీంతో మెహర్‌ రమేశ్‌ మూవీ ఆలస్యమైంది.

Mehar Ramesh, ntr, Sakthi, Mission Impossible


ఈ క్రమంలోనే నిర్మాత అశ్వినీదత్‌కు ఒక ఆలోచన వచ్చిందని అంటారు. ఎన్టీఆర్‌తో ‘పాతాళ భైరవి’, ‘జగదేక వీరుడు’లాంటి సోషియో ఫాంటసీ మూవీ తీయాలనుకున్నారట. అందుకోసం ఇండస్ట్రీలో అప్పటికే ఉన్న సీనియర్‌ రచయితలను పిలిపించి, తాను అనుకున్న ఆలోచనలను చెప్పడంతో సోషల్‌ ఫిల్మ్‌గా తీయాలనుకున్న ‘శక్తి’సినిమా కాస్తా  సోషియో ఫాంటసీ మూవీగా అయింది.

సుమారు రూ.25కోట్లతో సినిమా తీద్దామని షూటింగ్  మొదలు పెడితే, అది అలా అలా పెరిగిపోయి భారీ బడ్జెట్‌ చిత్రంగా మారిపోయింది. ఆధ్యాత్మిక కథలపై తనకు పెద్దగా అవగాహన లేకపోయినా, తన వంతు ప్రయత్నించి, సినిమాను తీసినట్లు మెహర్‌ రమేశ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ ఎన్టీఆర్‌తో ‘మిషన్ ఇంపాజిబుల్‌’లాంటి మూవీ చేసి ఉంటే, ఎలా ఉండేదో.. అంటారు!

NTR


మొహర్ రమేష్ మాట్లాడుతూ...‘శ‌క్తి’ సినిమా మొద‌లైంది ఆ క‌థ‌తో కాదు. ఒక గైడ్ ఉంటాడు, హోం మినిస్ట‌ర్ కూతురిని కాపాడ‌తాడు. కానీ, కాపాడింది గైడ్ కాదు క‌మాండో. సెకెండ్ ఆఫ్ లో ల‌వ్ స్టోరీ ఉంది. ఎన్టీఆర్ కి చెప్పింది, ద‌త్ గారికి చెప్పింది, ఆడ్వాన్స్ తీసుకుంది ఆ క‌థ గురించే. ఆ తర్వాత ద‌త్ గారు ఒక ఐడియా ఇచ్చారు. మేం కూడా ఆయ‌న ఐడియా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని ఫీల్ అయ్యాం. అలా ఈ సినిమా సోషియో ఫ్యాంట‌సీలా, డివైన్ ఎలిమెంట్ తో వ‌చ్చింది.

ఆయ‌న కొంత‌మంది రైట‌ర్ల‌ను ఇచ్చారు యండ‌మూరి వీరేంద్ర‌నాథ్, కొంత‌మంది పండితుల‌ను ప‌రిచ‌యం చేశారు. అలా నాకు తెలియ‌ని ఒక జోన‌ర్ లోకి తీసుకెళ్లారు. దాంతో అదొక క్రాస్ జండ‌ర్ ఫిలిమ్ అయిపోయింది. నేను అప్పుడు ఇది వ‌ద్దు ఇది వేరే క‌థ‌గా చేద్దాం. నాకే అర్థం కావ‌డంలేదు అని చెప్పాను. ఏ సినిమా ఆడ‌కూడ‌ని సినిమా చేయం క‌దా. ఇది బాగానే ఉంటుంది న‌మ్ము అని అన్నారు." 
 

Jr NTR , Marvel Cinematic Universe, Iron man

‘శక్తి’ మూవీపై గతంలో అశ్వినీదత్‌ కూడా స్పందించారు. ‘‘నా కెరీర్‌లో బాగా నిరాశకు గురి చేసిన సినిమా ‘శక్తి’. ‘ఇక మనకి ఈ ఇండస్ట్రీ అనవసరం. సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం’ అనిపించింది. నిర్మాణ వ్యయం బాగా ఎక్కువైపోయింది. ఆ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. ఇది మామూలు విషయం కాదు.  ‘శక్తి’ మాత్రం నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని అనిపించలేదు. ఈలోగా పిల్లలు వచ్చి సినిమా తీస్తామంటే ఒప్పుకొన్నా. మంచి సినిమాలు తీయడంతో వాళ్లను ప్రోత్సహిస్తూ వచ్చా’’ అని అశ్వినీదత్‌ అన్నారు.

Latest Videos

click me!