Singham 2: సూర్య హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'సింగం 2'లో పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించిన డానీ సపాని గుర్తున్నాడా.? మాఫియా కింగ్‌గా తన నటనతో భయపెట్టిన ఈ నటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?
పోలీస్ సినిమాల్లో 'సింగం' (తెలుగులో యముడు) సిరీస్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కోలీవుడ్ స్టార్ సూర్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రాల్లో హీరో పాత్ర ఎంత ఫేమస్ అయిందో, విలన్ పాత్రలు కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీలో రెండో భాగమైన 'సింగం 2'లో అంతర్జాతీయ మాఫియా డాన్ 'డానీ'గా నటించిన నటుడు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడి పేరు డానీ సపాని
25
నటనతో మెప్పించిన డానీ
సింగం 2లో మాఫియా కింగ్‌గా డానీ సపాని నటన అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్య, డానీ మధ్య వచ్చే ఛేజింగ్ సీన్లు, డైలాగ్ వార్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించాయి. ఆ సినిమాలో క్లీన్ షేవ్, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించిన డానీ, ఒక క్రూరమైన విలన్‌గా తన మార్కును చాటారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో అతడి పాత్ర కూడా కీలకమైంది.
35
ఎవరీ డానీ సపాని?
లండన్‌లో పుట్టి పెరిగిన డానీ సపాని ఒక అంతర్జాతీయ నటుడు. అతడు తన కెరీర్‌ను 'ది బిల్' అనే టెలివిజన్ సిరీస్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హాలీవుడ్‌లో 'హోటల్', 'ది ఆక్స్‌ఫర్డ్ మర్డర్స్', 'ట్రాన్స్' లాంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. భారతీయ సినిమాల్లోకి అతడు 'సింగం 2' ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడలో 'తరకాసుర' అనే చిత్రంలో కూడా నటించి మెప్పించాడు.
ప్రస్తుతం డానీ సపాని పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు కానీ, ఆయన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగం 2లో చూసిన దానికి ఇప్పటికి అతడు పూర్తిగా మారిపోయాడు. అప్పట్లో క్లీన్ షేవ్‌తో కనిపించిన అతడు, ఇప్పుడు పొడవాటి గడ్డంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
55
డానీ మామ ఇలా ఉన్నాడేంటి
వయసు పైబడటంతో వచ్చిన ఈ మార్పులు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "మా డానీ మామ ఇంతలా మారిపోయాడేంటి?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, సింగం 2లో అతడు పోషించిన ఆ విలన్ పాత్ర మాత్రం సినిమా ప్రేమికుల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.