ప్రముఖ నటుడు శివాజీ చిరంజీవి నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీపై కామెంట్స్ చేశారు. అదే విధంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన మాస్ సినిమాలు ఉన్నాయి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపాయి. అదే విధంగా ఇంద్ర సినిమా కూడా చరిత్ర సృష్టించింది. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.
25
ఇంద్ర మూవీలో శివాజీ
నటుడు శివాజీ కీలక పాత్రలో మెరిశారు. వీర మనోహర్ రెడ్డి పాత్రలో శివాజీ నటించారు. ఇంటర్వెల్ సీన్ మొత్తం శివాజీ పాత్ర చుట్టూనే ఉంటుంది. చిరంజీవిని వెన్నుపోటు పొడిచే ఆ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఓ ఇంటర్వ్యూలో శివాజీ ఆ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
35
ఆ సీన్ తర్వాత చిరంజీవి కాళ్ళు పట్టుకున్నా
రేయ్ వీర మనోహర్ రెడ్డి ఏంట్రా ఇంకా కుర్చున్నావ్.. పైకి లే అని ఆర్తి అగర్వాల్ అనగానే.. శివాజీ పైకి లేచి మెడలో ఉన్న పూల మాలని విసిరి కొడతాడు. చిరంజీవి ఆశ్చర్యంతో రేయ్ గిరి అని అనగానే.. ఏయ్ అంటూ శివాజీ కోపంగా అరుస్తాడు. ఆ సీన్ తర్వాత తాను చిరంజీవి గారి కాళ్ళు పట్టుకున్నట్లు శివాజీ తెలిపారు. ఏదో ఫ్లోలో అరిచేశా అని చిరంజీవి గారికి చెప్పా.
చిరంజీవి గారిని సినిమాలో అయినా సరే అలా అంటే అభిమానులు ఊరుకోరు కదా.. మిమ్మల్ని బెదిరించారా అని ఇంటర్వ్యూలో శివాజీకి ప్రశ్న ఎదురైంది. శివాజీ బదులిస్తూ లేదు.. అలా ఏమీ జరగలేదు. ఎందుకంటే అంత మూర్ఖంగా ఉండే అభిమానుల బ్యాచ్ తెలుగులో చాలా తక్కువ.
55
కృష్ణ గారికి మాత్రమే
అలాంటి అభిమానులు ఒకప్పుడు కృష్ణ గారికి ఉండేవారు. కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంటే తప్పనిసరిగా రక్తపాతం జరిగేది. అలా ఉండేది కృష్ణ గారి సినిమాల హంగామా. అలాంటి అభిమానులు కృష్ణ గారికి మాత్రమే సొంతం అని శివాజీ అన్నారు.