“దేవర” ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడా? ఫ్యాన్స్ సర్పైజ్

First Published | Aug 14, 2024, 9:36 AM IST

‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు...


 ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం  దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తెలుగు వాళ్లు మాత్రమే కాకుండా యావత్ దేశం ఎదురుచూస్తోందన్న సంగతి తెలిసిందే.   ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న చిత్రం కావటంలో .. దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 27, 2024  న రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న తారక్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనక బడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఓ అద్భుత చిత్రంగా ‘దేవర’ను తీర్చిదిద్దుతున్నారనే టాక్ రావటం మరో ప్లస్  పాయింట్.  



‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .  ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు.  రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.    ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరగనుంది. బారీగా అక్కడ ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారనే సమయం మాత్రం బయిటకు రాలేదు. ఇదే నిజమైతే రాయసీమ మొత్తాన్ని కర్నూల్ రిప్రజెంట్ చేసినట్లు ఉంటుందని అంటున్నారు. అలాగే సీడెడ్ లో ఎన్టీఆర్ కు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ తారక్ సినిమాలు అనేక రికార్డ్ లు క్రియేట్ చేసాయి.  ఆ బంధం ఈవెంట్ తో మరింత బలపడుతుంది. 
 


ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీమ్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్‌ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌‌ను రంగంలోకి దింపింది. "ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుపాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి" అంటున్నారు కరణ్ జోహార్ .
 

Latest Videos

click me!