SSMB29 : వచ్చే ఏడాదే మహేశ్ - రాజమౌళి సినిమా ప్రారంభం.. అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్!

First Published Dec 3, 2022, 6:05 PM IST

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. దీనిపై రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
 

SSMB29

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా  గుర్తింపు దక్కేలా చేశాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు మన జక్కన్న. దీంతో రాజమౌళి నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  
 

‘ఆర్ఆర్ఆర్’ విజయవంతం తర్వాత జక్కన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu)తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.  ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేళలకు సెట్ అవడంతో సినిమా ఎలా ఉండబోతుంది.. ఇంతకీ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

ఇప్పటికే జక్కన్న పలు వేదికలు, ఇంటర్వ్యూల్లో SSMB 29పై స్పందిస్తూ హైప్ క్రియేట్ చేస్తుండగా.. తాజాగా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) సినిమా ప్రారంభంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. అదేవిధంగా ఈ సినిమాకు మహేశ్ బాబునే ఎందుకు ఎంచుకున్నారనే దానిపైనా క్లారిటీ ఇచ్చారు.
 

 ‘ఎస్ఎస్ఎంబీ 29’గా రాజమౌళి - మహేశ్ చిత్రం రూపుదిద్దుకోనుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిత్రాలకు ఎప్పటి నుంచో తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేశ్ సినిమాకూ ప్రపంచ స్థాయి అడ్వెంచర్ తరహా స్టోరీని రెడీ చేస్తున్నారు. 

దీనిపై విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరంగా స్పందించారు.. ఎప్పటి నుంచో రాజమౌళి భారీ స్కేల్లో ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే టెక్నీకల్ టీమ్ నూ రెడీ చేసుకున్నారు. మహేశ్ బాబు ఇంటెన్స్ యాక్టర్ . యాక్షన్ సీన్స్ లో మహేశ్ అద్భుతంగా నటిస్తారు. ఇది కథను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రైటర్స్ కు మంచి అవకాశం.
 

ఎప్పుడు కావాలంటే అప్పుడు పాత్రలోకి  వెళ్లి వచ్చే సామర్థ్యం మహేశ్ సొంతం. అందుకే రాజమౌళి ఆయన్ని ఎంచుకున్నాడు. ఇక సినిమాలోని పాత్ర కూడా  సాహసాలు చేస్తూ అనేక దేశాలకు తీసుకెళ్లే విధంగా సాగుతుంది. షూటింగ్ ను వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం’ అని క్లారిటీ ఇచ్చారు.  2024లో ప్రారంభం అవుతుందని భావించినా.. వచ్చే ఏడాదే అని చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

click me!