Bigg Boss 6 Telugu: ఈవారం ఒకరి ఎలిమినేషన్‌ ఫైనల్‌.. మరి ఇంకో ఎలిమినేషన్‌ ఎవరిది?

Published : Dec 03, 2022, 05:15 PM IST

బిగ్‌ బాస్‌ 6 తెలుగు ఈ వారం ఎలిమినేషన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కీర్తి, రోహిత్‌, ఫైమా, శ్రీ సత్య కాస్త వీక్‌గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. వీరిలో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు. ఈ వీక్‌ డబుల్‌ ఎలిమినేషన్‌ అనేది మరింత ఉత్కంఠ రేకెత్తిస్తుంది.   

PREV
15
Bigg Boss 6 Telugu: ఈవారం ఒకరి ఎలిమినేషన్‌ ఫైనల్‌.. మరి ఇంకో ఎలిమినేషన్‌ ఎవరిది?

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో(Bigg Boss 6 Telugu) సీజన్‌ ముగింపు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో పూర్తి కాబోతుంది. విన్నర్‌ కన్ఫమే అనే టాక్‌ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 13వ వారానికి సంబంధించి ఎమినేట్‌ అయ్యేది ఎవరనేది ఆసక్తిని, ఉత్కంఠతని క్రియేట్‌ చేస్తుంది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందనే సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఎవరనేది హాట్‌ టాపిక్ గా మారింది.
 

25

ఈ వారం నామినేషన్‌లో రేవంత్‌, ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా, రోహిత్‌, శ్రీ సత్య ఉన్నారు. గత వారం రాజ్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం ఫైమా(Faima) ఎలిమినేట్‌ కాబోతుందని సమాచారం. అతి తక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఫైమా ఎలిమినేట్‌ (Faima Elimination) అయ్యిందని తెలుస్తుంది. అయితే ఫైమా ఎలిమినేషన్‌ అనేది ఆదివారం కాకుండా శనివారమే ఉండబోతుందని సమాచారం. 
 

35

అయితే ఫైమా గత రెండు వారాలకు ముందు వరకు బాగా ఆడింది. బాగా ఎంటర్‌టైన్‌ చేసిందని, కానీ ఇటీవల ఆమె డల్‌ అయ్యిందనే కామెంట్లు వచ్చాయి. పైగా లాజిక్‌ లెస్‌గా వ్యవహరించడం, ఎంటర్‌టైనింగ్‌ తగ్గించి మిగతా విషయాలపై ఆమె ఫోకస్‌ పెట్టిందని, దీనికితోడు ఓవర్‌ కాన్ఫిడెన్స్ తో ఉండటం వంటి ప్రవర్తన సంబంధించిన విషయాలు ఆమెకి మైనస్ అయ్యిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే ఆమెఎలిమినేషన్‌కి కారణమని అంటున్నారు. 

45

మరోవైపు ఈ వారం డబుల్‌ ఎలిమినేన్‌ అనే మాట బలంగా వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే మరో కంటెస్టెంట్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 90శాతం డబుల్‌ ఎలిమినేషన్‌కి ఛాన్స్ లేదని, ఒకవేళ ఉంటే శ్రీ సత్య ఎలిమినేట్‌ కావడం పక్కా అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందనే వేచి చూడాలి. 

55

ప్రస్తుతం హౌజ్‌లో ఫైమా, శ్రీసత్యలతోపాటు రేవంత్‌, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, కీర్తి, ఇనయ, రోహిత్ ఉన్నారు. వీరిలో టాప్‌ రేవంత్‌ టికెట్‌ టూ ఫినాలే ద్వారా ఫైనల్‌కి చేరబోతున్నారని, అది శనివారం ఎపిసోడ్‌లో తెలుస్తుందని అంటున్నారు. మరోవైపు టాప్‌ 5లో రేవంత్‌తోపాటు ఆదిరెడ్డి, శ్రీహాన్‌, ఇనయ, కీర్తి ఉండే అవకాశం ఉందట. వీరిలో రేవంత్‌ టైటిల్‌ విన్నర్‌ అంటున్నారు. అదే సమయంలో రేవంత్‌, ఇనయ మధ్య పోటీ ఉంటుందని సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories