టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం పెద్ద పనిగా మారింది. చిరంజీవి, బాలయ్య లాంటి 60ప్లస్ హీరోలకు హీరోయిన్లుగా పెద్దగా ఆప్షన్లు కనిపించడంలేదు. దాంతో బాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్య తో అనిల్ రావిపూడి చేయబోతున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్ష్మీ సిన్హాను తీసుకున్నట్టు టాక్ వచ్చింది.