కోప్పడ్డ ఆ స్టార్ హీరోయిన్ ని బ్రతిమిలాడుతున్న చిరంజీవి, మళ్ళీ ఆయనతో మూవీ చేయలేదు, ఇంతకీ ఏం జరిగింది?

First Published | Sep 16, 2024, 1:59 PM IST

చిరంజీవి చాలా సౌమ్యుడు. ఎవరితో అయినా మర్యాదగా మాట్లాడతాడు. తాను పెద్ద హీరోని అనే పొగరు ఉండదు. అటువంటి చిరంజీవి కూడా కొందరు నటులతో విభేదించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఓ స్టార్ హీరోయిన్ ఆయనకు చుక్కలు చూపించిందట.

Chiranjeevi

90లలో నగ్మా స్టార్ గా వెలిగింది. అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న నగ్మా ఇండియా వైడ్ టాప్ హీరోలతో జతకట్టింది. చిరంజీవి-నగ్మా కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఘరానా మొగుడు. ఇది సూపర్ హిట్. అనంతరం ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో జతకట్టారు. 
 

1995లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన రిక్షావోడు చిత్రంలో మరోసారి నగ్మా, చిరంజీవి జతకట్టారు. ఈ చిత్రంలో నగ్మా గొప్పింటి అమ్మాయి పాత్ర చేయగా... చిరంజీవి రిక్షా కార్మికుడు పాత్ర చేశాడు. రామానాయుడు స్టూడియోలో 'పాప ఎదిరింప' అనే సాంగ్ షూట్ చేస్తున్నారట. 

షాట్ గ్యాప్ లో చిరంజీవి-నగ్మా మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందట. నగ్మా అలిగి కోపంగా మేకప్ రూమ్ నుండి వెళ్లిపోతుంటే... చిరంజీవి బ్రతిమిలాడుతూ ఆమె వెనకాల పడ్డాడట. నగ్మా... ఆగు, నా మాట విను అంటున్నారట. ఏం జరుగుతుందని సెట్ లో ఉన్నవారంతా వాళ్లనే చూస్తున్నారట. 
 


ఆ రోజు షూటింగ్ అయితే జరిగిందట. రెండో రోజు కూడా అదే సాంగ్ మిగిలిన పార్ట్ షూట్ చేశారట. చిరంజీవి ఎప్పటిలాగానే అందరితో మాట్లాడుతూ నార్మల్ గా కనిపించారట. నగ్మా మాత్రం ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయిందట. అసలు నగ్మా-చిరంజీవి కి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అనేది ఎవరికీ తెలియదట.

రిక్షావోడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ తర్వాత నగ్మాతో చిరంజీవి మరో మూవీ చేయలేదు. దాన్ని బట్టి చూస్తే పెద్ద గొడవే జరిగింది. అది మేకప్ రూమ్ లో జరిగిన నేపథ్యంలో సెట్స్ లో ఉన్నవారెవరికీ స్పష్టంగా తెలియదు. ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చాయనేది మాత్రం నిజం

Actress nagma and Ganguly

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విశ్వంభర తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సురభి, ఈషా చావ్లా, ఆషిక రంగనాథ్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తరహాలో చిరంజీవి పాత్ర ఉంటుందట. ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇది ఒకింత వివాదాస్పదమైంది. విశ్వంభర చిత్రానికి వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.

Latest Videos

click me!