పవన్ కళ్యాణ్ తన పిల్లలు అకీరా, ఆద్యలతో ఏ భాషలో మాట్లాడతారో తెలుసా?

First Published Oct 26, 2024, 7:12 AM IST

అకీరా, ఆద్యలతో రెండు భిన్నమైన భాషల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడతాడట. ఆద్య కోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఒక భాష నేర్చుకున్నాడట. ఇంతకీ రేణు దేశాయ్ పిల్లలతో ఆయన ఏ భాషల్లో మాట్లాడతాడో తెలుసా?
 

రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యన్ నటి అన్నా లెజెనోవాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. మరోవైపు రేణు దేశాయ్ తో ఆయనకు అకీరా, ఆద్య సంతానంగా ఉన్నారు. విడాకులు అనంతరం రేణు దేశాయ్ పూణే వెళ్ళిపోయింది. అక్కడే అకీరా, ఆద్య చదువుకున్నారు. పెరిగి పెద్దయ్యారు. ప్రస్తుతం రేణు దేశాయ్ హైదరాబాద్ కి వచ్చేశారు. ఆమె ఇక్కడే ఉంటున్నారు. 
 

విడాకులు తీసుకున్నప్పటికీ..  రేణు దేశాయ్ పూణేలో ఉన్నప్పుడు పిల్లల కోసం పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు అక్కడకు వెళ్లేవాడట. పవన్ కళ్యాణ్, పిల్లలు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఏ భాషలో మాట్లాడుకుంటారు? అనేది రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే ఆద్యతో ఒక భాషలో, అకీరాతో మరొక భాషలో పవన్ మాట్లాడుతారట.


పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో స్నేహం కొనసాగిస్తున్నారు. పిల్లలకు తండ్రిగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని రేణు దేశాయ్ పలు సందర్భాల్లో అన్నారు. నేను నా డబ్బులు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్మెంట్ భారీగా పెరిగింది. ఆ డబ్బులతో పిల్లలను పోషించానని ఆమె అంటారు. అయితే రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు డబ్బులు సమకూర్చుతారనే వాదన ఉంది. 

Latest Videos



పవన్ కళ్యాణ్ తరచుగా పూణే వెళ్ళేవాడు. పిల్లలు ఆయనతో టచ్ లో ఉండేవారు. కలవాలని ఫోన్ చేస్తే వీలు చేసుకుని పవన్ కళ్యాణ్ పూణే వెళ్లేవాడట. ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న రేణు దేశాయ్ గతంలో వెల్లడించింది. 

రేణు దేశాయ్ మాట్లాడుతూ...  ఆద్య చాలా కమాండింగ్ గా ఉంటుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు కలుస్తావు. మమ్మల్ని చూడాలని లేదా... నువ్వు వెంటనే రావాలని గట్టిగా మాట్లాడుతుంది. అకీరా అలా కాదు. ఆద్యతో నేను మరాఠిలో మాట్లాడతాను. తనతో మరాఠీలోనే మాట్లాడాలని ఆద్య కండిషన్ పెట్టింది. అకీరాతో మాత్రం తెలుగులో మాట్లాడతాను. వాళ్ళ నాన్న భాష అకీరా మర్చిపోకూడదు కదా.. 
 

అకీరా-పవన్ తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్ళు లైఫ్, ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్య సినిమా ప్రస్తావన రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. నేను కూడా ఆయనతో మాట్లాడతాను. విడాకుల తర్వాత మేము మిత్రులు గా కొనసాగుతున్నామని గతంలో కూడా నేను చెప్పాను.

ఆద్య వాళ్ళ నాన్నతో మరాఠీలోనే మాట్లాడుతుంది. నా కోసం ఆయన భాష నేర్చుకోలేదు. ఆద్య కోసం మరాఠీ నేర్చుకున్నారు. ఆద్య-పవన్ మరాఠీలో మాట్లాడుకుంటారని... చెప్పుకొచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్, అకీరా కలిస్తే సినిమా ప్రస్తావన రాదట. లైఫ్, ఫిలాసఫీ మాట్లాడుకుంటారట. రేణు దేశాయ్ గతంలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అన్నా లెజినోవా రష్యన్ కావడంతో పవన్ కళ్యాణ్ ఆ భాష సైతం నేర్చుకున్నాడని సమాచారం. రష్యన్ ఆయన మాట్లాడతారట. చెన్నైలో పెరిగిన నేపథ్యంలో తమిళ్ వచ్చు. ఇటీవల కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్ కన్నడలో మాట్లాడి ఆశ్చర్య పరిచారు. 

Pawan Kalyan and Akira Nandan

ఇక అకీరా టీనేజ్ దాటేసి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభించారు. సమయం దొరికినప్పుడల్లా.. షూటింగ్ లో పాల్గొంటున్నారట. సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు పవన్ కళ్యాణ్ కమిటై ఉన్నారు. వీటిని కూడా పూర్తి చేయాల్సి ఉంది.

click me!