ఇక ఆర్ ఆర్ ఆర్ గ్లోబల్ వైడ్ మోత మోగించింది. ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టింది. ఫ్యాన్ రైవల్రి పతాక స్థాయిలో ఉండే మెగా-నందమూరి హీరోలు మల్టీస్టారర్ చేయడం మరొక విశేషం. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
కాగా స్టూడెంట్ నెంబర్ వన్ మూవీలో ఓ సూపర్ హిట్ సాంగ్ నాకు అసలు నచ్చలేదని రాజమౌళి ఓ సందర్భంలో తెలియజేశాడు. అసలు ఇదేం సాంగ్ రా బాబు, అని తలగోక్కున్నాడట. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీకి కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అనంతరం ఓ కార్యక్రమంలో కే రాఘవేంద్రరావు, రాజమౌళి, ప్రభాస్ పాల్గొన్నారు.