రజనీ నేల మీద పడుకుంటే, అమితాబ్ AC కారులో, క్రేజీ సీక్రెట్ రివీల్‌

First Published | Sep 23, 2024, 10:47 AM IST

`వేట్టైయాన్‌`.. అమితాబ్ నటిస్తున్న మొదటి తమిళ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరాకి రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో అమితాబ్‌ ఓ రహస్యం బయట పెట్టారు.

Rajinikanth, Amitabh Bachchan, Vettaiyan

సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ చిత్రం దసరా స్పెషల్‌గా అక్టోబర్ 10న విడుదలయ్యేందుకు సిద్ధమైన సంగతి తెలసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో గ్రాండ్‌గా ఆడియో వేడుకను నిర్వహించారు.   ఈ కార్యక్రమానకి అమితాబ్ బచ్చన్ హాజరుకాలేదు కానీ తన వాయిస్ నోట్ పంపారు. ఇది షోలో ప్లే చేశారు.. రజనీకాంత్ గురించి బచ్చన్ మాట్లాడుతూ.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 కి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ స్టోరీస్‌ ఇక్కడ చూడండి.

అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ... ‘హమ్’ సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రజనీకాంత్ విరామ సమయంలో నేలపై పడుకునేవారు. నేను మాత్రం నా ఏసీ వాహనంలో పడుకునేవాడిని. అయితే రజనీకాంత్ నేలపై పడుకోవడం చూసి నేను ఏసీ వాహనం నుంచి బయటకు వచ్చాను. రజనీకాంత్ స్టార్స్ అందరికంటే సుప్రీమ్ స్టార్’ అని ప్రశంసలు కురిపించారు అమితాబ్. 


రజనీకాంత్ మాట్లాడుతూ.. 'అమితాబ్‌ బచ్చన్‌ సినీ నిర్మాతగా భారీ అర్ధిక నష్టాలను చవిచూశారు. ఒకానొక సమయంలో తన వాచ్‌మెన్‌కు కూడా జీతం ఇవ్వలేని స్థితికి చేరిపోయారు. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన  జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. అప్పడు బాలీవుడ్‌ మొత్తం ఆయన్ను చూసి నవ్వింది. పతనమైనప్పటికీ సరిగ్గా మూడేళ్లలో తిరిగి మళ్లీ నిలబడ్డారు. 

ఇక అమితాబ్ ఆ  తర్వాత కౌన్‌ బనేగా కరోడ్‌పతి నుంచి చేతికి వచ్చిన ప్రతి యాడ్‌ చేస్తూ కష్టపడ్డారు. అందుకోసం ఆయన చాలా శ్రమించారు. 82 ఏళ్ల వయసులో కూడా రోజుకు 10 గంటలకు పైగానే కష్టపడ్డారు. తను ఎక్కడైతే కిందపడ్డారో మళ్లీ అక్కడే తనేంటో చూపించారు.  జూహూలోని తన ఇంటితో పాటు మరో  మూడు ఇళ్లను తిరిగి కొనుగోలు చేశారు.' అని రజనీ చెప్పారు. 

అలాగే అమితాబ్‌ బచ్చన్‌ గురించి మాట్లాడుతూ ఒక అరుదైన విషయాన్ని రజనీకాంత్‌ ఇలా పంచుకున్నారు. ఒకసారి అమితాబ్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విదేశాల్లో ఓ సదస్సుకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు వచ్చారు. రాజీవ్ గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారని అప్పుడే అందరికీ తెలిసింది. అలా గాంధీ కుటుంబంతో ఆయనకు దగ్గరి పరిచయాలు ఉన్నాయని అప్పుడే తెలిసింది.  
 

rajinikanth Amitabh Bachchan

అమితాబ్ జీ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గొప్ప రచయిత. తనకు కష్టం వచ్చినప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఎవరినైనా సాయం అడగొచ్చు. కానీ, ఆయన అలాంటి పనిచేయలేదు. కష్టాల్లో కూడా తనంతట తానే తిరిగి మళ్లీ నిలబడ్డారు. అమితాబ్‌ ఎందరికో ఆదర్శం అని రజనీకాంత్ అన్నారు.

 వెట్టయాన్ అమితాబ్ మొదటి తమిళ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తే, బచ్చన్ లాయర్ పాత్రలో నటించారు. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, కన్నడ కిషోర్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్‌ నిర్మించారు. వేట్టయాన్‌లో సత్యదేవ్  పాత్రలో అమితాబ్ నటించారు.   

Latest Videos

click me!