సిమ్రన్ కు కోపమొచ్చింది, ఏకి పారేసింది

First Published | Sep 23, 2024, 10:05 AM IST

వేరే వాళ్లు చెప్పిన విషయాలు నా ఫ్రెండ్స్ నమ్మడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సైలెంట్‌గా ఉన్నాను.

Simran

తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సిమ్రన్ ఇప్పటికి ఎక్కడో సీరియల్ లోనో, వెబ్ సీరిస్ లోనో కనపడుతూంటుంది. కెరీర్ ని కొనసాగించే పక్రియలో స్టార్ హీరోల సినిమాల్లోనూ కీ రోల్స్ వేస్తోంది. అయితే ఈ క్రమంలో ఆమెను తక్కువ చేసి మాట్లాడటం మాత్రం తట్టుకోలేకపోయింది.

 ప్రస్తుతం ఇంటర్ నెట్ లో  వేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సిమ్రాన్ ఓ రేంజిలో  మండింది. ఆమె  అసహనం వ్యక్తం చేసిన తీరు చూస్తుంటే.. ఆమె ఎంతగా బాధపడి ఉంటుందో అర్థం అవుతుంది. తనకు ఏదైనా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ ప్రియారిటీ, అదే ముఖ్యమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సిమ్రాన్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
 

Simran and Priyanka Mohan


1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది.  1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో చిరంజీవి,రజనీకాంత్‌,కమల్‌ హాసస్‌, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్‌గా మెప్పించింది.  

మా నాన్నకి పెళ్లి, కలిసుందాం రా, నరసింహ నాయుడు, నువ్వు వస్తావని, మృగరాజు, సమరసింహా రెడ్డి, సీతయ్య, డాడీ, ప్రేమతో రా.. ఇలా అనేక సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరైంది. 


Actress Simran


సిమ్రన్  కొన్నేళ్ల క్రితం నటించిన ధ్రువ నక్షత్రం ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది. అలాగే శబ్ధం, అంధగన్‌, వనంగముడి అనే తమిళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.సుమారుగా 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పిన సిమ్రాన్‌ పలు తమిళ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.  వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
 


ఆ పోస్ట్ లో ఏముంది అంటే .... 'వేరే వాళ్లు చెప్పిన విషయాలు నా ఫ్రెండ్స్ నమ్మడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నా. ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలనే కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాల్లో చేశా. ఇప్పుడు నా లక్ష‍్యాలు వేరు. నా పరిమితులు నాకు తెలుసు. ఒకరు లేదా మరొకరితో ముడిపెడుతూ ఇన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నాను'
 


'నాకంటూ ఆత్మగౌరవం ఉంది. దానికే నా మొదటి ప్రాధాన్యత. కాబట్టి ఇకపైనా ఆపండి అని చెబుతున్నాను. ఈ ప్రచారాలని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అలానే క్లారిటీ తీసుకునే విషయమై నన్ను సంప్రదించలేదు. సరిగ్గా చెప్పాలంటే నన్ను అసలు పట్టించుకోలేదు. నా పేరు ఎప్పుడు పోగొట్టుకోలేదు. సరైన విషయం కోసమే నిలబడ్డాను. ఇండస్ట్రీ నుంచి అదే కోరుకుంటున్నా. నాపై తప్పుడు వార్తలు రాస్తున్న వాళ్లు వెంటనే క్షమాపణలు చెప్పాలి' అని నటి సిమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 

సిమ్రాన్ ఇలా కోప్పడటానికి విజయ్‌తో సినిమా చేయనుందనే రూమర్సే కారణం అని తెలుస్తోంది.సిమ్రాన్ ను హీరో విజయ్ తిరస్కరించాడంటూ ఓ పత్రిక పెద్ద కథనం రాసుకొచ్చింది. విజయ్ తో సినిమా నిర్మించేందుకు సిమ్రాన్ ప్లాన్ చేసిందట, డేట్స్ కోసం అతడ్ని సంప్రదించిందంట. ఆ ప్రతిపాదనను విజయ్ తిరస్కరించాడనేది కథనం.  ఇప్పుడు వీటిపై స్పందిస్తూనే పరోక్షంగా ఈ పోస్ట్ పెట్టింది.

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

ప్రస్తుతం తమిళంలో ఐదారు చిత్రాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. ఇటీవల తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన ‘మహాన్’మూవీలో నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ ఆడియెన్స్ నోట పర్లేదనిపించుకుంది. ‘రాకెట్రీ, అందగన్, క్యాప్టెన్, ధ్రువ నక్షత్రం, వనంగముడి’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలోనూ ‘గుల్మోహర్’లో కనిపించనుంది.

ఇక సిమ్రన్  సుందరకాండ అనే తెలుగు సీరియల్‌లో 2009-2011 మధ్యకాలంలో ఆమె కనిపించింది. తాజాగా ఆమె మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నారట.  ఏదైనా రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా సిమ్రాన్‌ రాబోతున్నారని లో జోరుగా ప్రచారం జరుగుతుంది.మరికొందరైతే సిమ్రాన్‌ సీరియల్స్‌ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని, ఇప్పటికే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయని తెలుపుతున్నారు.  సినిమాల విషయానికి వస్తే ధ్రువ నక్షత్రం,  అంధాగన్‌ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంధాగన్‌ హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా, తమిళంలో సిమ్రన్‌, మలయాళంలో మమతామోహన్‌దాస్‌ పోషించారు.

Latest Videos

click me!