ఇక రాముడి పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ అయితే అందరికంటే ఎక్కువ అల్లరే చేసేవారట. విపరీతమైన గోల చేశాడట. అంతే కాదు చిన్నా పెద్దా అందరిని ఆటపట్టించేవాడట. యుద్ద సన్నివేశాల కోసం తెచ్చిన బాణాలు విరగొట్టాడట కూడా . శివ ధనుర్భంగం సీన్ కోసం ప్రత్యేకంగా కనిపించాలని టేకుతో ఓ విల్లును తయారు చేయించారట డైరెక్టర్ గుణశేఖర్.
అలాగే మరో డూప్లికేట్ విల్లును కూడా తయారు చేయించి పక్కన పెట్టారట. అయితే ఓవైపు షూటింగ్ పనులు జరుగుతుంటే మరోవైపు ఎన్టీఆర్ మిగతా పిల్లలతో కలిసి డూప్లికేట్ విల్లును పైకి లేపారట.
ఆ తర్వాత టేకు విల్లును కూడా పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తూ దానిని విరగొట్టారట. దీంతో డైరెక్టర్ గుణశేఖర్ తారక్ పై కోప్పడాడట. ఇక దర్శకుడు ఇలా కోపంతో తిట్టేవరకు ఎన్టీఆర్ అలిగాడట. ఇక నేను ఈ సినిమా చేయను.. వెంటనే ఇంటికి వెళ్లిపోతాను అంటూ మారాం చేశాడట.