ఇక వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక వీటితో పాటు వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ కూడా పెద్దగా ఆడియన్స్ ను అలరించలేకపోయింది. ఇక ఎంతో ఖర్చు పెట్టి.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన సైరా మాత్రం కలెక్షన్ల పరంగా రాబట్టలేకపోయినా.. మంచి ప్రయత్నంగా మాత్రం మిగిలిపోయింది.
ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా మెగాస్టార్ కు హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. ఈసినిమా ద్వారా త్రిష దాదాపు 20 ఏళ్ల తరువాత చిరంజీవితో కలిసి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మెగాస్టార్ తన కెరీర్ ల ఎంతో మంది హీరోయిన్లతో కలసి నటించారు.