షాక్: ఎన్టీఆర్ ‘దేవర’లో ఆ పాట ఏమైంది? ఎందుకు తీసేసారు

First Published | Sep 27, 2024, 3:54 PM IST

చిత్రంగా ఈ సినిమాలో ఆల్రెడీ హిట్టైన ఓ పాట లేకపోవటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.  


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన  భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రం ఈ రోజు రిలీజయ్యి  ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన  ఈ చిత్రం లో ఓ పాటను తీసేయటం డిస్కషన్ గా మారింది.

devara part 1

 
హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘దేవర’పై అంచనాలు ఓ రేంజ్‍లో ఉన్నాయి. మూవీకి పాటలతోనే మరింత హైప్ యాడ్ ఏర్పడింది. అయితే ఫస్టాఫ్ లో హీరోయిన్ అసలు ఉండదు. సెకండాఫ్ లోనే హీరోయిన్ జాన్వీ కనిపిస్తుంది. ఎన్టీఆర్ రెండో పాత్ర వర సరసన ఆమె కనిపిస్తుంది.

 ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి. అయితే చిత్రంగా ఈ సినిమాలో ఆల్రెడీ హిట్టైన ఓ పాట లేకపోవటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.  


#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva


ఆ పాట మరేదో కాదు  ‘దావూదీ’. ఆల్రెడీ ఇప్పటికి ఈ సాంగ్ కు చెందిన  అనే వీడియో  ని మేకర్స్ విడుదల చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వీడియో సాంగ్  రిలీజ్ అయిన కాసేపటికే ఈ 'దావూదీ' సాంగ్ యూట్యూబ్‍ ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చేసింది.

ఈ పాటకు ట్రెండీ ఫాస్ట్ బీట్‍ను ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. తెలుగులో లిరిక్స్ అందించారు రామజోగయ్య శాస్త్రి. ఈ పాటలో ‘దావూదీ’.. ‘కిళికిళియే’ అనే పదాలు ఎక్కువగా ఉన్నాయి. పాట క్యాచీగా డ్యాన్స్ నంబర్‌గా ఉండాలనే ఇలాంటి పదాలు వాడారు.
 


దావూదీ పాటకు సంబంధించి లిరికల్ వీడియో కాకుండా వీడియో సాంగ్‍నే మూవీ టీమ్ తీసుకురావటంతో జనాల్లోకి బాగా వెళ్లింది. ఈ సాంగ్ కు  డ్యాన్స్‌తో అదరగొట్టారు ఎన్టీఆర్, జాన్వీ కపూర్. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఆ పాట ఇలా సాగుతుంది.

కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల

పొయిమీన మరిగిందె మసాలా

చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల

కసి మీన తొలి విందులియ్యాల

 కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో

కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
 


ఎందుకు తీసేసారు

అందుతున్న సమాచారం మేరకు ఈ పాటను మొదట సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ తో పెడదామనుకున్నారు. RRR (2022) లో ఎత్తర జెండా టైప్ లో ఈ పాట రానుందని తెలిసింది. అయితే ఫైనల్ కట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ ఓ ఎమోషన్ లో ఉన్నప్పుడు ఆ పాటను పెడితే సినిమా డ్రాప్ అవుతుందనిపించి తీసేసారని తెలుస్తోంది. ఫైనల్ కట్ లో ఈ డెసిషన్ తీసుకుని ట్రిమ్ చేసారట. వారం తర్వాత కలిపే అవకాసం ఉందంటున్నారు. కుదరకపోతే సెకండ్ పార్ట్ లో ఆ పాట ఉండచ్చు అంటున్నారు.
 

Latest Videos

click me!