వివరాల్లోకి వెళితే... 80-90లలో సుహాసిని స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో అధికంగా చిత్రాలు చేసింది సుహాసిని. సుహాసిని హీరో కమల్ హాసన్ కి కజిన్. ఇక చిరంజీవి-సుహాసిని కాంబోలో అనేక హిట్ చిత్రాలు తెరకెక్కాయి. మంచు పల్లకీ కోసం ఫస్ట్ టైం సుహాసిని-చిరంజీవి జతకట్టారు. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు.
అనంతరం మగమహరాజు, ఛాలెంజ్, చంటబ్బాయి, ఆరాధన, మంచి దొంగ, కిరాతకుడు, రాక్షసుడు వంటి పలు చిత్రాల్లో చిరంజీవితో సుహాసిని స్క్రీన్ షేర్ చేసుకుంది. అనేక సినిమాల్లో కలిసి నటించిన నేపథ్యంలో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది.