కాగా సమీరాతో లవ్ ఎఫైర్ పై ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్పందించారు. అది యుక్త వయసులో చేసిన పొరపాటు అన్నట్లు మాట్లాడారు. ఏదో ఒక సమయంలో, ఎవరో ఒకరి మీద ప్రేమ కలుగుతుంది. కొంత సమయానికి రియలైజ్ అయ్యాను. కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యాను, అని ఎన్టీఆర్ అన్నారు.
మళ్ళీ ఆ ప్రేమ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అని యాంకర్ అడగ్గా.. లేదు ఒకసారి ఫిక్స్ అయ్యాక మళ్ళీ ఆలోచించను. ప్రొఫెషనల్ లైఫ్ తో పర్సనల్ లైఫ్ మిక్స్ చేయకూడదు. వాటిని వేరు వేరుగా చూడాలని తెలుసుకున్నాను. ఆ సమయంలో మా అమ్మను ఎవరైతే బాగా చూసుకుంటారో, ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను.