బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ రేటింట్ తో దూసుకుపోతోంది. పెద్దగా తెలిసినవారు లేదు.. ఫస్ట్ వీక్ అంతా గొడవలతో ఆడియన్స్ ను చిరాకు పెట్టారు అనుకున్నా.. సెకండ్ వీక్ నుంచి కాస్త దార్లో పడ్డారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. గ్యాప్ లేకుండా టాస్క్ లు ఇవ్వడంతో.. ఎవరికి వారు గెలవాలి అనే ఆశతో.. పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు.
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్.. యంగ్ డైరెక్టర్ తో..?
ఇక ఈక్రమంలో హౌస్ లో కొంత మంది ప్రవర్తన వల్ల ఆడియన్స్ కు చిరాకు వచ్చేస్తోంది. అందులో ఈరెండు వారాలు సోనియా వల్ల, యష్మి వల్ల హౌస్ మొత్తానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయితే వారిని మాత్రం బిగ్ బాస్ కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్ గా అర్ధం అవుతోంది. హౌస్ లో వారు చేసిన పనులకు జనాలకు విసుకువచ్చేస్తుంది.
ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ లో సోనియా విష్ణు ప్రియపై చేసిన కామెంట్స్ అందరు విన్నారు. ఈ విషయంలో వీకెండ్ లో నాగార్జున గట్టిగా క్లాస్ కూడా పీకారు. అయితే ఇక్కడే చిన్న విషయం ఏంటంటే.. తిడుతున్నట్టు తిడుతూ.. సోనియాకు బయట జరిగే విషయంలో హిట్ కూడా ఇచ్చినట్టు అనిపించింది.
చిరుత మూవీకి రామ్ చరణ్ తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
సోనియా విష్ణు ప్రియపై చేసిన కామెంట్లను చెప్పిన నాగార్జున.. ఆమెకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ.. నువ్వు ఇలానే ఉంటే బయట నీమీద నెగిటివిటీ పెరుగుతుంది అన్నట్టుగా మాట్లాడారు. దాంతో సోనియా అలెర్ట్ అయ్యి.. తన గేమ్ స్ట్రాటజీని మార్చుకునే విధంగా ఇండైరెక్ట్ గా హిట్ ఇచ్చినట్టు అయ్యింది.
అటు యష్మి విషయంలో కూడా ఇలానే వారి తప్పుడు ఎత్తి చూపుతూ.. కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు ఆడియన్స భావిస్తున్నారు. సోనియా రెండు వారాలు హౌస్ ను బాగా డిస్ట్రబ్ చేసింది. అందరితో గొడవలు తనకు ఇష్టమైనవారితోనే క్లోజ్ గా మాట్లాడటం లాంటివి కనిపించింది.
అంతే కాదు విష్ణు ప్రియను ప్రతీ విషయంలోనోటికి వచ్చినట్టు మాట్లాడటంతో.. ఆమెను హౌస్ లోకి వెల్ళి కొట్టేంత కోపం వస్తుంది అంటున్నారు కొంత మంది ఆడియన్స్. అయినా సరే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి.
లాస్ట్ సీజన్ లో కూడా శోభ శెట్టిని కూడా ఇలానే కాపాడారు. శోభాపై ఇంట్లో, బయట కూడా బాగా నెగెటీవ్ టాక్ వచ్చంది. అయిన కూడా ఆమెను చివరి వరకూ కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు సోనియా, యష్మి విషయంలో కూడా ఇలాంటి ఫార్ములానే వాడుతున్నారమో అన్న అనుమానాలు వస్తున్నాయి.
అటు శోభా శెట్టి సీరియల్స్ లో విలన్ వేశాలు వేస్తుంటుంది. ఇటు యష్మి కూడా విలన్ పాత్రలే చేస్తుంది. ఇక సోనియా యాటిట్యూడ్ లోనే విలనిజం కనిపిస్తుంది. ఇలా నెగెటీవ్ షేడ్స్ ఉన్నవారిని బిగ్ బాస్ ఎందుకు కాపాడాలని చూస్తున్నారంటూ... నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు వాళ్లకు లేని పోని హిట్లు ఇచ్చి.. బిగ్ బాస్ హౌస్ లో ఇంకా గలాట చేయించాలనుకుంటున్నారా అని కూడాప్రశ్నిస్తున్నారు.
Bigg Boss Telugu Season 8
ఇక శనివారం నాగార్జున్ హెచ్చరికతో సోనియాలో మార్పు కనిపిస్తుంది. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో విష్ణును ఆ రేంజ్ లో విమర్శించిన సోనియా.. ఇఫ్పుడు ఆమెను గట్టిగా అంటుకుని కనిపిస్తుంది. గేమ్ స్ట్రాటజీని కంప్లీట్ గామార్చేసింది. మంచిగామాట్లాడటానికి ప్రయత్నిస్తోంది.
ఇక అటు యష్మీ అయితే తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.లాస్ట్ టైమ్ సోనియా ఎలాగైతే నోరు జారిందో.. ఈసారి యష్మి కూడా అలానే నోరు జారింది. మణికంఠ, సోనియా నామినేషన్ టైమ్ లో బొక్క అంటూ బూతులు మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక హౌస్ లో మణికంఠ డిఫరెంట్ అవుతాడు అనుకుంటే.. సోనియా, యష్మిలు అంతకంటే డిఫరెంట్ గా కనిపిస్తూ.. విమర్శల పాలు అవుతున్నారు. మరి ఈ ఇద్దరిని కూడా చివరి వారం వరకూ బిగ్ బాస్ లాక్కెల్తారా.. ? లేక నెటిజన్ల విమర్శలకు తలొక్కి మధ్యలోనే పంపించేస్తారా అనేది చూడాలి.