చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ కొట్టి హీరోగా సెటిల్ అయిన విలన్, మెగాస్టార్ కి షాక్!

First Published Oct 8, 2024, 8:00 AM IST


చిరంజీవి కొన్ని కారణాలతో ఓ కథను రిజెక్ట్ చేశాడు. అదే కథతో విలన్ గా కొనసాగుతున్న నటుడు బ్లాక్ బస్టర్ కొట్టి హీరోగా స్థిరపడ్డాడు. 
 

Mohan Babu

ఎంత టాలెంట్ ఉన్నా.. మంచి సబ్జెక్ట్స్ ఎంచుకున్నప్పుడే కెరీర్ ఉంటుంది. దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి. పేపర్ మీద అద్భుతంగా అనిపించే కథలు సిల్వర్ స్క్రీన్ పై తేలిపోవచ్చు. అలాగే స్క్రిప్ట్ దశలో సాదాసీదా అనిపించిన కథలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేయవచ్చు. అనుకోని కారణాలతో ఒకరు చేయాల్సిన మూవీ మరొకరి వద్దకు చేరొచ్చు. చిరంజీవి వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ఆయన చేయకపోవడంతో మరో నటుడు వద్దకు వెళ్ళింది. ఆ నటుడు ఎవరో కాదు మోహన్ బాబు. 
 

Mohan Babu

చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్టు తో బ్లాక్ బస్టర్ కొట్టాడు మోహన్ బాబు. ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరీర్ నే మార్చేసిన ఆ సినిమా ఏమిటో చూద్దాం. మోహన్ బాబు కెరీర్ విలన్ గా మొదలైంది. బిగినింగ్ లో ఆయన కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్ తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించాడు. 90ల నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. 

దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడుగారు మూవీలో మోహన్ బాబు హీరోగా చేశాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ, ప్రతినాయకుడు పాత్రలు చేయడం ఆపలేదు. 
 

Latest Videos


Mohan Babu

1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది. అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకుడు కాగా... ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలని అనుకున్నారట. చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇప్పుడు చేయడం కుదరదు. సమయం పడుతుంది అన్నారట. 

దాంతో బి.గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకుపోయాడు. మోహన్ బాబు ఓకే చేయడంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దివ్యభారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ హిట్ మూవీ వేలై కీడైచుడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. 

Mohan Babu

తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు. మోహన్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు, తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు అవతరించాడు. 

హీరోగా మోహన్ బాబు కెరీర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. 

అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ చిరంజీవికి మిస్ అయినప్పటికీ... ఆయనకు గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది. 1991లోనే విడుదలైన గ్యాంగ్ లీడర్ అనేక రికార్డులు తుడిచిపెట్టింది. ఈ చిత్రానికి విజయ బాపినీడు దర్శకుడు. చిరంజీవి ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అది.

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

గ్యాంగ్ లీడర్ - 1991

గ్యాంగ్ లీడర్ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి రెమ్యూనరేషన్ రూ. 1 కోటి దాటేసింది. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అంటూ బాలీవుడ్ మ్యాగజైన్ లో కథనం రావడం విశేషం. గ్యాంగ్ లీడర్ అనంతరం చిరంజీవి సినిమాకు రూ. 1.25 కోట్లు తీసుకున్నారట. 

click me!