బిగ్ బాస్ తెలుగు 8 షోకి పెద్దగా రేటింగ్ రావడం లేదు. కంటెస్టెంట్ల ఆటలో మజా లేదు. పెద్దగా కంటెంట్ రావడం లేదు. ఆడియెన్స్ నుంచి కూడా పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. పైగా నోటెడ్ సెలబ్రిటీలు లేకపోవడంతో జనం బిగ్ బాస్‌ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లని దించాడు బిగ్ బాస్. గేమ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు అదిరిపోయే కంటెస్టెంట్లని హౌజ్‌లోకి దించడం విశేషం. వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ, హరితేజ, నయని పావని, గౌతమ్ కృష్ణ, మెహబూబ్, రోహిణి బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
వీరిలో చాలా వరకు కమెడియన్లని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆటలో ఫైరింగ్ సీన్లు ఉన్నాయి, డ్రామా ఉంది. కొంత లవ్ ట్రాక్ కూడా కనిపించింది. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఫన్ అసలే లేదు. ఎంతసేపు ఆరోపణలు, కుట్రలతోనే సాగింది. ఈ నేపథ్యంలో ఎంటర్‌టైన్‌మెంట్ ని పెంచేందుకు బిగ్ బాస్ ప్రయత్నించారు. అందుకే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పించిన వారిలో నలుగురు ఎంటర్‌టైనర్స్ ఉండటం విశేషం. అవినాష్, గంగవ్వ, రోహిణి, టేస్టీ తేజ, హరితేజలు వినోదాన్ని పంచడంలో ముందుంటారు. వీరి ద్వారా టాస్క్ లతో రచ్చ చేయించడంతోపాటు వినోదాన్ని కూడా పంచేందుకు ప్లాన్ చేశారట. దీంతో వచ్చీ రావడంతో ఆ కామెడీని స్టార్ట్ చేశారు రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, ఈ ముగ్గురు మిగిలిన వారిని ఆడుకున్నారు. నవ్వులు పూయించారు.
అనంతరం ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో పాత కంటెస్టెంట్లని కొత్త కంటెస్టెంట్లు నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్లకి టైమ్ లేదు కాబట్టి వాళ్లని నామినేట్ చేయడానికి లేదని, అలాగే మెగా చీఫ్ అయిన నబీల్‌ని నామినేట్ చేయడానికి లేదు. ఈ క్రమంలో హరితేజ.. యష్మి, పృథ్వీరాజ్‌లను నామినేట్ చేసింది. నాగమణికంఠని వరుసగా నామినేట్ చేయడం, ఆయన్ని టార్గెట్ చేయడం బాగా లేదని చెప్పి నామినేట్ చేసింది. పృథ్వీరాజ్ ని సైతం ఆమె నామినేట్ చేసింది. గౌతమ్ కృష్ణ వచ్చి.. విష్ణు ప్రియా, యష్మిలను నామినేట్ చేశాడు. తన గేమ్ పక్కన పెట్టి పక్కవారిపై ఫోకస్ పెడుతున్నావని విష్ణు ప్రియాని అన్నాడు గౌతమ్ కృష్ణ. అలాగే యష్మిని నామినేట్ చేస్తూ, రివేంజ్ నామినేషన్ నచ్చ లేదని తెలిపారు. నయని పావని.. విష్ణు ప్రియా, కిర్రాక్ సీతలను నామినేట్ చేసింది. గేమ్ సరిగా ఆడటం లేదని, సీరియస్ నెస్ లేదని, మీరు బాగా ఆడే అవకాశాలు ఉన్న ఉపయోగించడం లేదని చెప్పి నామినేట్ చేసింది. చీఫ్ అవ్వాలనే తపన లేదు, విన్నర్ అవ్వాలనే తపన లేదు. మీరు హౌజ్ లో ఉండటం దండగా అని తెలిపింది. కిర్రాక్ సీత కూడా గేమ్‌లో యాక్టివ్‌గా లేదని, తప్పించుకుంటుందని తెలిపింది.
మెహబూబ్.. కిర్రాక్ సీత, యష్మిలను నామినేట్ చేశాడు. తాము హౌజ్‌లోకి వచ్చినప్పుడు మిగిలిన వాళ్లు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని, కానీ ఈ ఇద్దరు అంతటి ఇంట్రెస్ట్ ని చూపించడం లేదని తెలిపాడు మెహబూబ్. తమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని చెప్పాడు. టేస్టీ తేజ.. కిర్రాక్ సీత, మణికంఠలను నామినేట్ చేశాడు. ఇప్పటి వరకు పెద్దగా సీత ఆట్ట పెద్దగా లేదని చెప్పాడు.
అలాగే మణికంఠని నామినేట్ చేస్తూ అందరికి సమస్యలున్నాయి, చెప్పలేని బాధలున్నాయి. కానీ ఇక్కడ ఎవరూ చెప్పుకోరని, మనసులోనే దాచుకుంటారని, కానీ నువ్వు ప్రతి రోజు అదే సింపతి ప్లే చేస్తున్నావని, నీ ఆట తీరు ఫేక్‌గా ఉందని ఆరోపించారు. సింపతీ గేమ్ అయిపోయిందని, పదే పదే ఆ కార్డ్ వాడటం సరికాదని,
ఇకపై మార్చుకోవాలని తెలిపారు. ఇలా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ చాలా మామూలుగానే జరిగింది. పెద్ద హడావుడి లేదు. హిటేక్కించే విషయం లేదు సప్పగా సాగుతుంది. అందుకే ఈ టీమ్‌ని బిగ్ బాస్ కోకి దించాడు .
వచ్చీ రావడంతో రచ్చ షురూ చేశౠరు. ఇది నవ్వులు పూయించింది.
Bigg boss telugu 8
ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు అంతా నాగమణికంఠ, యష్మిలను టార్గెట్ చేశారు. మణికంఠకి సింపతీ చూపిస్తూ యష్మిని టార్గెట్ చేస్తున్నారు. మణికంఠని బ్యాక్ టూ బ్యాక్ యష్మి నామినేట్ చేసిన నేపథ్యంలో అది సరైనది కాదని కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు చెబుతున్నారు. దీంతో ఆట మొత్తం మణికంఠ, యష్మిల చుట్టూనే తిరుగుతుంది. వాళ్లే కీ ప్లేయర్స్ గా మారిపోయారు. ఈ క్రమంలో ఇతర కంటెస్టెంట్లు వెర్రీ పుష్పాలు అయ్యారు. అయితే ఇక్కడ కొత్త వారి విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం పట్ల పాత కంటెస్టెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొత్త కంటెస్టెంట్లు కొత్తగా చెప్పడానికి ఏం లేక వారినే నామినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.