హీరోయిన్ మాధురి దీక్షిత్ దయావన్ మూవీలో హీరో వినోద్ ఖన్నాతో కిస్సింగ్ సన్నివేశం చేసింది. అందుకు చాలా బాధపడుతున్నట్లు ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. బ్రేక్ కే బాద్ మూవీలో ఇమ్రాన్ ఖాన్-దీపికా పదుకొనె జంటగా నటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనెతో కిస్సింగ్ సన్నివేశం చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన రన్బీర్ కపూర్-కత్రినా కైఫ్ తర్వాత బ్రేకప్ అయ్యారు. అనంతరం జగ్గా జాసూస్ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఈ మూవీలో కత్రినాతో లిప్ లాక్ సన్నివేశం ఉంచగా... రన్బీర్ కపూర్ బుగ్గ మీద ముద్దు పెట్టి సరిపెట్టాడట. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ జతకట్టారు. అలియాతో లిప్ లాక్ అనుభవం దారుణం అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు.