సూర్య ‘కంగువ’: స్టోరీ లైన్ , తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు

First Published | Nov 13, 2024, 8:52 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివతో కలిసి తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. 

Actor Suriya upcoming Tamil film Kanguva update

తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా భారీ అంచనాల మధ్య ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 14న 8 భాషల్లో ఈ కంగువా విడుదలకి సిద్ధమవుతోంది.

తమిళ్ బాహుబలిగా అక్కడి మీడియా ఈ కంగువా సినిమానికి అభివర్ణిస్తుండగా.. రూ.1000 కోట్ల వరకూ వసూలు చేస్తుందని తమిళ ట్రేడ్ నమ్ముతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి, సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగులో ఏ మేరకు జరిగింది అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఆ విషయాలు చూద్దాం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

kanguva movie


 తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం కంగువ. ఈ  సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ చిత్రం టీమ్ ఓ ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ విషయంలోనూ ఈ మూవీ సినీ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తోంది.

ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సూర్య డిఫరెంట్ గెటప్‍లో యోధుడిగా నటిస్తున్నారు.  ఈ మేరకు సినిమా ప్రమోషన్స్‌ బాధ్యతలను కూడా భుజాన వేసుకుని హీరో సూర్య దేశమంతా తిరుగుతున్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లోనూ కంగువాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైపోయింది. 


Kanguva movie


 ‘కంగువ’ చిత్రం కథ ఓ గిరిజన యోధుడు చుట్టూ తిరుగుతుంది. అతను 1678 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయింతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏమిటి...ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేసారనేదే కథ. గతంలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో సూర్య ఓ చిత్రం చేసారు. ఆ సినిమా పేరు 24.

ఇప్పుడు కూడా టైమ్ ట్రావెల్ తో రెండు విభిన్న కాలాలలో ఈ సినిమా జరుగుతుంది. ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రం రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. ఈ నేపధ్యంలో చిత్రం గురించి చెప్తూ ఈ ప్లాట్ ని రివీల్ చేసారు.  ఈ మూవీ కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ సినిమాని ఆడియన్స్ కి చూపించబోతున్నారు.  .  దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Kanguva


‘కంగువ’ప్రీ రిలీజ్ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో సూర్య కు ఉన్న క్రేజ్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. అయితే ప్రమోషన్స్ బాగా చెయ్యటం, సినిమా  ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్  కావటంతో ఇక్కడ 25 కోట్లు దాకా తెలుగు రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం.

ఇది ఇప్పుడున్న సూర్య స్దాయి కు మంచి ఫిగరే. రెగ్యులర్ గా తెలుగులో సూర్య సినిమాలు 10 నుంచి 15 కోట్లు మించి అమ్ముడుపోవటం లేదు. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తేనే ఒడ్డుక్కుతారు. మినిమం 35 కోట్లు అయినా ఇక్కడ రాబట్టగలగాలి. అప్పుడే షేర్ పరంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. 

Suriya film Kanguva

 
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివతో కలిసి తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో లాంగ్ హెయిర్‌తో సూర్య ఇంటెన్స్ గెటప్‍తో ఉన్నారు. ఓ తెగకు నాయకుడిగా ఆయన ఉండనున్నట్టు  అర్థమవుతోంది.

ఆయన కత్తితో తెగనరికే సీన్లు అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా క్రూరంగా భయంకరమైన పాత్ర చేస్తున్నట్టు అర్థమవుతోంది. సూర్య, సన్నీ ఎదురెదురుగా గట్టిగా అరిచే షాట్‍తో కంగువ టీజర్ ఎండ్ అయింది. అద్భుతమైన విజువల్స్, డైరెక్టర్ శివ టేకింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్, సూర్య, బాబీ డియోల్ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కంగువ టీజర్ ఆశ్చర్యపరిచేలా ఉంది.

read more: శోభన్‌బాబు చేయాల్సిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆ స్టార్‌ హీరోయినే కొంప ముంచిందా?

also read: మహేష్, రాజమౌళి కాశీలో సందడి..? కథకు కీలకం అక్కడే

Latest Videos

click me!