స్టార్‌ హీరోని పెళ్లి చేసుకోబోతున్న ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? 3వేల కోట్లకి కాబోయే అధిపతి చిన్ననాటి ఫోటోలు

First Published | Nov 13, 2024, 9:54 AM IST

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మామూలు అమ్మాయిలు కాదు. ఎన్నో అవమానాలు ఫేస్‌ చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి. ఇప్పుడు ఓ స్టార్‌ హీరోని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది. 

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణం. కొంతమంది తమ ప్రేమను బయటపెట్టి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది పెళ్లికి ముందే విడిపోతారు. ఈ ఫోటోలు కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు పెద్ద స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అంతేకాదో ఓ స్టార్‌ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

శోభిత చిన్ననాటి ఫోటోలు

ఈ ఫోటోలో క్యూట్ గా ఉన్న చిన్నారి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో వనతిగా నటించిన శోభిత ధూళిపాళ్ల. తెనాలిలో పుట్టిన శోభిత మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి మెర్చంట్ నేవీ ఇంజనీర్, తల్లి టీచర్. విశాఖపట్నంలో స్కూల్ చదువు పూర్తి చేసిన శోభిత, తర్వాత ముంబైకి వెళ్లారు. కార్పొరేట్ లా చదివి, ఆ తర్వాత ముంబయి యూనివర్సిటీలో H.R., బిజినెస్, ఎకనామిక్స్  స్టడీస్‌ పూర్తి చేశారు.


సోభిత సినీ ప్రస్థానం

చదువులో మంచి విద్యార్థిని అయిన శోభిత, చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు. 2010లో నేవీ బాల్ పోటీలో పాల్గొని నేవీ క్వీన్ గా ఎంపికయ్యారు. దీంతో ఆమెకు అందాల పోటీల(మోడలింగ్‌) పై ఆసక్తి పెరిగింది. స్నేహితురాలి ద్వారా మోడలింగ్ లోకి అడుగుపెట్టిన శోభిత, ఫిలిప్పీన్స్ లో జరిగిన మిస్ ఎర్త్ 2013, మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీ ఫర్ ఎ కాజ్, మిస్ టాలెంట్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ పోటీల్లో పాల్గొన్నారు. మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాలు వెతుక్కుంటూ బాలీవుడ్ లో అడుగుపెట్టారు.

సోభిత, నాగ చైతన్య

బాలీవుడ్‌ సినిమా `రామన్‌ రాఘవ్‌ 2.0` చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన శోభిత తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించారు. `పొన్నియిన్ సెల్వన్` లో వానతి పాత్రలో ఆకట్టుకుంది. ఆమె తెలుగులో `గూఢచారి`, `మేజర్‌` చిత్రాల్లో మెరిసింది.  నాగార్జున కొడుకు, హీరో నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్న శోభిత ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతుంది. ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్‌ రహస్యంగా జరిగింది. డిసెంబర్‌లో మ్యారేజ్‌ కి రెడీ అవుతున్నారు. డిసెంబర్‌6న వీరి మ్యారేజ్‌ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుందని సమాచారం. 

నాగ చైతన్య కాబోయే భార్య

సమంత, నాగ చైతన్య విడిపోవడానికి శోభిత కారణం అనే ప్రచారం జరుగుతుండగా, నాగ చైతన్య రూ.3330 కోట్ల ఆస్తికి వారసుడు కాబట్టే శోభిత అతన్ని పెళ్లి చేసుకుంటోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ నాగ చైతన్య అభిమానులు ఇది నిజమైన ప్రేమ అని, అందుకే పెళ్లి వరకు వచ్చిందని అంటున్నారు. త్వరలోనే 3330 కోట్ల ఆస్తికి అధిపతి అయిన నాగ చైతన్య భార్య కాబోతున్నారు శోభిత.

read more: శోభన్‌బాబు చేయాల్సిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆ స్టార్‌ హీరోయినే కొంప ముంచిందా?

also read: సన్యాసిగా మారిపోతుందేమో అని అనుష్క పేరెంట్స్ లో టెన్షన్‌, యోగా టీచర్‌ స్వీటికి ముందే చెప్పాడా?

Latest Videos

click me!