ఎన్టీఆర్-సావిత్రి-ఏఎన్నార్ నటించిన క్లాసిక్ మిస్సమ్మ చిత్రానికి పెళ్లి పుస్తకం దగ్గరగా ఉంటుంది. ఎన్టీఆర్-సావిత్రి మిస్సమ్మ మూవీలో ఉద్యోగం కోసం భార్య భర్తలుగా నటిస్తారు. పెళ్లి పుస్తకం మూవీలో భార్య భర్తలు అయిన రాజేంద్ర ప్రసాద్-దివ్య వాణి ఉద్యోగం కోసం పరిచయం లేని వ్యక్తులుగా ఒకే ఆఫీస్ లో నటిస్తూ పని చేస్తారు.
ఆ ఒక్క పోలిక మినహాయిస్తే సన్నివేశాలు, కథనం అంతా భిన్నంగా రాసుకున్నారు. పెళ్లి పుస్తకం చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ''శ్రీరస్తు శుభమస్తు'' సాంగ్ ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో, వీడియోల్లో వినిపిస్తుంది. అంతగా ఫేమస్ అయ్యింది ఈ పాట. బాపు టేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది.