రాజమౌళిపై భయంతో లైపోసక్షన్‌ చేసుకున్న స్టార్‌ హీరో? అంతగా అవమానించాడా?

First Published | Nov 12, 2024, 4:50 PM IST

రాజమౌళి అపజయం లేని దర్శకుడు. తన చేతిలో హీరో పడితే స్టార్‌ అయిపోవడం పక్కా. అలాంటి రాజమౌళిని చూసి ఓ హీరో భయపడ్డాడు. ఏకంగా లైపోసక్షన్‌ కూడా చేయించుకున్నాడు. 
 

రాజమౌళి తన సినిమా కెరీర్‌లో ఇప్పటి వరకు ఆరుగురు హీరోలతోనే వర్క్ చేశారు. ఎన్టీఆర్‌తో స్టార్ట్ చేసిన ఆయన ఆయనతోనే నాలుగు సినిమాల చేశారు. ప్రభాస్‌తో మూడు సినిమాలు చేశారు. రామ్‌ చరణ్‌తో రెండు సినిమాలు. రవితేజతో ఓ సినిమా, నానితో, సునీల్‌తో ఒక్కో మూవీ చేశారు. ఫస్ట్ టైమ్‌ ఇప్పుడు మహేష్‌ బాబుతో పనిచేయబోతున్నారు. పదేళ్ల నాటి కమిట్‌ మెంట్‌ని ఇప్పుడు ట్రాక్‌ ఎక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

NTR-Rajamouli

ఇదిలా ఉంటే రాజమౌళి `స్టూడెంట్‌ నెం 1` సినిమాతో దర్శకుడిగా మారారు. ముందుగా ఈ చిత్రానికి వేరే హీరో అనుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ లైన్‌లోకి వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆబ్లిగేషన్‌లో తారక్‌తో రాజమౌళి సినిమా చేయాల్సి వచ్చింది. అలా ఈ మూవీతో తారక్‌, రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే అప్పటికే రాజమౌళి సీరియల్స్ చేశారు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్‌గానూ పని చేశారు.  
 


రాజమౌళి దర్శకుడిగా మారాలనుకున్నప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా అని చెప్పగా, తారక్‌ని చూసిన రాజమౌళి వామ్మో ఇంత లావుగా ఉన్నాడు, వీడు హీరో ఏంటి? వీడితో నేను సినిమా చేయడమేంటి? అని మనసులో అనుకున్నాడట. పలు ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రాజమౌళినే చెప్పారు. ఇది అందరికి తెలిసిన రహస్యమే.

అలాంటి ఎన్టీఆర్‌తోనే నాలుగు సినిమాలు చేశారు రాజమౌళి. `స్టూడెంట్‌ నెం1`తోపాటు `సింహాద్రి`, `యమదొంగ`, `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాలు చేశారు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. సినిమా రిలేషనే కాదు, దానికి మించిన ఫ్రెండ్‌షిప్‌ ఇద్దరి మధ్య ఉందని చెప్పొచ్చు. ఫ్యామిలీ పరంగానూ చాలా క్లోజ్‌. 

NTR-Rajamouli

అయితే `స్టూడెంట్‌ నెం 1`, `సింహాద్రి` సినిమాల సమయంలో ఎన్టీఆర్‌ లావుగానే ఉన్నాడు. బొద్దుగా కనిపించాడు. అంత లావుగా ఉన్నా కూడా డాన్సులు, యాక్టింగ్‌ పరంగా ఇరగదీశాడు. ఆ లుక్‌లోనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ కొట్టాడు రాజమౌళి. కానీ అప్పటి వరకు సమస్య లేనిది `యమదొంగ` సమయంలో మాత్రం సమస్యగా మారింది. అప్పటికే తారక్‌ బాగా లావయ్యాడు.

రాఖీ సమయంలో మరింత లావుగా కనిపిస్తాడు. అలా చూసిన రాజమౌళి ఇక మనసులో అనుకోవడం కాదు, ఏకంగా బయటకే అనేశాడు. తారక్‌తోనే అన్నాడు, బాగా లావున్నావు, చెండాలంగా ఉన్నావ్‌ తారక్‌, బరువు తగ్గాలి అన్నాడట. సినిమా స్క్రిప్ట్ చెప్పకుండా వాస్తవాలు చెప్పాడట. `చాలా చెండాలంగా ఉన్నావ్‌ తారక్‌ మీరు, ఒక సెక్టార్‌ ఆఫ్‌ ఆడియెన్స్ మీ సినిమాలు చూడటం మానేశారు, మీకు తెలుసా? అన్నాడట. 
 

NTR-Rajamouli

అంతే ఒక్కసారిగా గుండె పడిపోయినంత పనైందట. మిమ్మల్ని యూత్‌ చూడటం లేదు, అమ్మాయిలు చూడటం లేదు అన్నారట. మరింతగా అవమానంగా ఫీలయ్యాడట జూ ఎన్టీఆర్‌. మీరు ఇంత లావుగా ఉంటే ఏం లాభం, సన్నబడాలి అన్నాడట రాజమౌళి. సన్నగా కావాలంటే ఏం చేయాలని అడిగితే లైపోసక్షన్‌ గురించి చెప్పాడట.

అలా లైపోసక్షన్‌ చేయించుకుని సన్నగా మారినట్టు తెలిపారు ఎన్టీఆర్‌. ఇంకా వేరే ఎలా చేసినా బరువు తగ్గడం, పెరగడం జరుగుతుందని, దీని ద్వారా అయితే ఎప్పటికీ సన్నగానే ఉండొచ్చని భావించి లైపోసక్షన్‌ చేయించుకున్నట్టు తెలిపారు తారక్‌. బహుశా ఇలా బరువుకారణంగా లైపోసక్షన్‌ చేయించుకున్న ఏకైక టాలీవుడ్‌ హీరో తారక్‌ కావడం గమనార్హం. 

అందుకే `యమదొంగ` సినిమాలో చాలా సన్నగా కనిపించాడు ఎన్టీఆర్‌. `కంత్రి`లోనూ మరీ సన్నగా కనిపించి షాకిచ్చాడు. `అదుర్స్` సినిమాకి కొంత సెట్‌ అయ్యాడు. `బృందావనం`లో బెటర్‌గా కనిపించాడు అప్పట్నుంచి ఇప్పటి వరకు అదే వెయిట్‌ని మెయింటేన్‌ చేస్తున్నాడు తారక్. ఇక ఇటీవల ఆయన `దేవరః పార్ట్ 1` సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇది భారీ విజయాన్ని సాధించింది. నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇందులో మరో పార్ట్ రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ లాంచ్‌ కాబోతుందని తెలుస్తుంది. 

rwad more:చిరంజీవి పాట పాడితే సినిమా ఆడదా? ఆ ఫలితం చూశాక మెగాస్టార్ సంచలన నిర్ణయం ?

also read: తప్పు తెలుసుకుని రియాలిటీలోకి వచ్చిన మంచు మనోజ్‌, తండ్రి మోహన్‌బాబు నేర్పిన పాఠాలు ఇంప్లిమెంట్‌

Latest Videos

click me!