అజిత్‌ మగాడేనా అంటూ సంచలనం రేపే కథనం, ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్ట్ కి తలా సాయం

First Published | Nov 12, 2024, 5:26 PM IST

 కోలీవుడ్‌ స్టయిలీష్ స్టార్‌, తలా అజిత్ కుమార్  గురించి ఓ జర్నలిస్ట్ దారుణంగా రాశాడు. కోలీవుడ్‌లో తన పరువంతా తీశాడు. కానీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ జర్నలిస్ట్ ని అజిత్‌ కాపాడాడు. 
 

అజిత్ సినిమాలు

అజిత్‌ హీరోగా కాకముందే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిశాడు. తమిళంలో  1990లో 'ఎన్ వీడు ఎన్ కణవర్' అనే సినిమాలో బాలనటుడిగా కనిపించాడు. ఈ మూవీతోనే నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు.  ఆ తర్వాత 1993లో 'అమరావతి' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత అజిత్ నటించిన `పవిత్ర`, `రాజావిన్ పార్వైయిల్` వంటి సినిమాలు చేయగా, అవి బాక్సాఫీసు వద్ద భారీ నష్టాలను మిగిల్చాయి.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు పరాజయం చెందడంతో అజిత్ ఎంతో బాధపడ్డాడు. తన వల్ల నిర్మాతలు నష్టపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. ఇక సినిమాల నుంచి తప్పుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన చివరి ప్రయత్నంగా `ఆశ` సినిమాలో నటించాడు. దీనికి  వసంత్ దర్శకత్వం వహించగా,  మణిరత్నం నిర్మించారు.  ఈ సినిమా విజయం అజిత్ నిర్ణయాన్నే మార్చేసింది. `ఆశ`సినిమా తర్వాత అభిమానులు ఎక్కువగా ఇష్టపడే హీరోగా మారారు. ఆయనకంటూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది, క్రమంలో ఒక్కో విజయాన్ని అందుకుంటూ హీరోగా ఎదిగాడు. స్టార్‌గా గుర్తింపు తెచ్చకున్నాడు అజిత్‌. 


అజిత్ కుమార్ సినిమా

`బానుమతి`, `కల్లూరి వాసల్`, `మైనర్ మాప్పిళ్ళై` వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన అజిత్‌కు 'కదల్ కోట్టై' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఒకే తరహా కథలను ఎంచుకోకుండా యాక్షన్ కథలపై అజిత్ ఆసక్తి చూపడం ప్రారంభించారు.

`వాలి`, `అమర్‌కలం`, `కాండు కొండేన్ కాండు కొండేన్`, `దీనా`, `రాజా`, `విలన్`,`బిల్లా 2 వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అజిత్‌ని తిరుగులేని స్టార్‌ని చేశాయి. ఈ మూవీస్‌తో అజిత్‌ అభిమానులకు మరింతగా దగ్గరయ్యాడు.  స్టయిలీష్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన్ని ముద్దుగా ఫ్యాన్స్ `తలా` అని పిలుచుకోవడం విశేషం. 

అజిత్, షాలిని

అజిత్ మంచి నటుడు కావడంతో పాటు మంచి వ్యక్తిగా కూడా అభిమానులకు తెలుసు. అదేవిధంగా తన వంతు సాయం అందరికీ చేస్తూనే ఉంటారు. ఈ విషయాలను అజిత్ ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ ఆయన సాయం గురించి తెలిసిన చాలా మంది ప్రముఖులు ఇంటర్వ్యూలలో ఈ విషయాలను పంచుకున్నారు.

 అజిత్ తనకు సాయం చేసిన విషయాన్ని జర్నలిస్ట్ పాండియన్ వెల్లడించారు. అజిత్‌కు పెళ్లయి రెండేళ్లు అయినా పిల్లలు పుట్టకపోవడంతో తిరైచ్చువై అనే పత్రిక `అజిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ రెండు మూడేళ్లుగా పిల్లలు లేరు, ఆయనకు పురుషత్వం ఉందా అనే సందేహం ఉందని రాసి అవమానించింది.  

 read  more: రాజమౌళిపై భయంతో లైపోసక్షన్‌ చేసుకున్న స్టార్‌ హీరో? అంతగా అవమానించాడా?

జర్నలిస్టుకు అజిత్ సాయం

కొన్నేళ్ల తర్వాత ఈ వార్త రాసిన జర్నలిస్ట్ విజయ హాస్పిటల్‌లో గుండెపోటుతో చేరి 2.5 లక్షల రూపాయల ఆపరేషన్‌కు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న అజిత్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ డబ్బు కట్టారు. అప్పుడు ఆయనను PRO ఎందుకు సార్ అని అడిగితే, "అజిత్ ఈ సమయంలో మనం ఆయనను ప్రతీకారం తీర్చుకోకూడదు. బలంగా ఉన్నప్పుడు మనం గొడవ పడవచ్చు. ఒక జర్నలిస్ట్ బలహీనంగా(అనారోగ్యంతో) హాస్పిటల్‌లో పోరాడుతున్నాడు. అలాంటప్పుడు మనం ఈగోకి పోకూడదు` అని చెప్పారు.

ఈ విషయాన్ని ఇప్పుడు జర్నలిస్ట్ పాండియన్ చెప్పడంతో అది వైరల్ అవుతోంది. అజిత్ సినీ పరిశ్రమకు చెందిన చాలా మందికి సాయం చేశారు. ముఖ్యంగా తన ఇంట్లో పనిచేసే వారి కోసం చెన్నైలో స్థలం కొని 12 ఇళ్లు కట్టించారు. వాళ్లు రావడానికి, వెళ్లడానికి ప్రత్యేకంగా వ్యాన్ సౌకర్యం ఉంది.

also read: నటుడు నెపోలియన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?.. వీల్‌చైర్‌లోనే కొడుకు పెళ్లి, ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాక్‌

Latest Videos

click me!