బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో హౌస్ లో నాల్గవ రోజు ఊహించని ఎలిమినేషన్ జరిగింది. సీజన్ 10 ప్రారంభమై వారం కూడా గడవకముందే తొలి ఎలిమినేషన్ జరిగింది. ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ హౌస్ ని వదిలాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో గురువారం సెప్టెంబర్ 10న ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. షో ప్రారంభమై వారం కూడా గడవలేదు. అయినా ఊహకందని విధంగా ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. నాల్గవరోజు ఎపిసోడ్ బ్లూ టీం, రెడ్ టీం మధ్య టాస్క్ తో ప్రారంభమైంది. బ్లూ టీం నుంచి త్రిగుణ్, ముఖేష్.. రెడ్ టీం నుంచి రోహిత్, వంశీ పాల్గొన్నారు. త్రిగుణ్, ముఖేష్ ముందుగా టాస్క్ కంప్లీట్ చేశారు. కానీ వాళ్ళు చిన్న పొరపాటు చేయడం తో ఆ టాస్క్ లో రోహిత్, టెంపర్ వంశీ విజయం సాధించినట్లు బిగ్ బాస్ పేర్కొన్నారు.
25
చైత్ర కన్నీళ్లు పెట్టుకుంది
తమ టీం నుంచి చైత్ర రాయ్ ని రోహిత్ హై రిస్క్ లో పెట్టారు. హై రిస్క్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రోహిత్, వంశీ విజయం సాధించగానే షాలిని సెలెబ్రేషన్ చేసుకోవాలి అని పిలుపునిచ్చింది. కానీ సొంత టీం మెంబర్ అయినా చైత్ర హై రిస్క్ లో ఉందని తెలిసి కూడా ఆమె పట్టించుకోలేదు. దీనితో చైత్ర కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత షాలిని తన తప్పు తెలుసుకుని వివరణ ఇవ్వడానికి చైత్ర వద్దకు వెళ్ళింది. నేను రోహిత్ విజయం సాధించినందుకు హ్యాపీ ఫీల్ అయ్యా..అంతే కానీ మీరు హై రిస్క్ లో ఉన్నందుకు కాదు అని చెప్పింది.
35
అందరి మీద ఎగిరెగిరి పడతావ్
అయినప్పటికీ చైత్ర రాయ్ కి షాలిని చేసిన పని నచ్చలేదు. దీనితో ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వాళ్ళ గొడవ చేరింది. నీ బిహేవియర్ అందరికీ తెలుసు, అందరి మీద ఎగిరెగిరి పడతావ్ అంటూ షాలినిని చైత్ర దూషించింది. తన క్యారెక్టర్ పై నిందలు వేయడంతో షాలిని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ తర్వాత ఎప్పటి లాగే త్రిగుణ్, రోహిత్ మధ్య కిచెన్ లో చిల్లర గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు చిల్లర కామెంట్స్ చేసుకున్నారు.
ఆ తర్వాత అసలు కథ మొదలయింది. ఆల్రెడీ రాంప్రసాద్, చరణ్ హైరిస్క్ లో ఉన్నారు. వీళ్ళతో చైత్ర కూడా జాయిన్ అయింది. వీళ్ళ ముగ్గురిలో ఒకరు ఈ రోజే ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ బాంబ్ పేల్చారు. ముగ్గురిని గార్డెన్ ఏరియాకి పిలిచారు. చరణ్, రామ్ ప్రసాద్ ఇద్దరూ చైత్రని సేవ్ చేసి వాళ్ళు మాత్రం రిస్క్ లోనే ఉన్నారు. చరణ్, రామ్ ప్రసాద్ ఒకరిపై ఒకరు నెగిటివ్ పాయింట్స్ చెప్పుకున్నారు. ఒక అమ్మాయి వారానికి వెయ్యి అని పాట పాడుతుంటే.. అబ్బో చాలా ఎక్కువ అని రామ్ ప్రసాద్ అనడం ఏమాత్రం నచ్చలేదు అని చరణ్ తెలిపారు.
55
చరణ్ ఎలిమినేట్
ఇది పెద్ద వివాదమే అయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు షాలిని. దీనితో షాలిని రామ్ ప్రసాద్ ని ప్రశ్నించింది. మీకు అభ్యంతరం అయి ఉంటే అప్పుడే నన్ను అడ్డుకుని ఉండాలి అని రామ్ ప్రసాద్ అన్నారు. నేను వినలేదు. చరణ్ విన్నాడు అని ఆమె చెప్పింది. చరణ్ అయినా నాతో చెప్పి ఉండాలి కదా. అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు కావాలని టార్గెట్ చేయడం ఏంటి అని రామ్ ప్రసాద్ ప్రశ్నించారు. రామ్ ప్రసాద్, చరణ్ ఇద్దరిలో ఎవరు ఎలిమినేటి కావాలి అనే దానిపై బిగ్ బాస్ ఓటింగ్ పెట్టారు. చరణ్ ఎలిమినేట్ కావాలని ఎక్కువ మంది సభ్యులు ఓట్ వేశారు. దీనితో చరణ్ ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. కానీ చరణ్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చూపించలేదు. అతడి ఎలిమినేషన్ లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది వేచి చూడాలి.