అసలు నీకు అర్థం అవుతుందా.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నీ సినిమాలు చూడటం లేదు. యూత్, అమ్మాయిలు ఇలా ఉంటే ఎలా ఇష్టపడతారు. నువ్వు బరువు తగ్గాలి, అని రాజమౌళి అన్నారు. సరే ఆ బరువు ఎలా తగ్గాలో కూడా నువ్వే చెప్పు, అని రాజమౌళిని అడిగాను. అప్పుడు నేను లైపోసక్షన్ చేయించుకున్నాను. నేను ఎలా బరువు తగ్గితే మీకెందుకు అనుకున్నాను. బరువు తగ్గాక నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను, అన్నారు.
శరీరంలోని అధిక కొవ్వును తొలగించే ప్రక్రియను లైపోసక్షన్ అంటారు. ఇది ఒకింత ప్రమాదకరం కూడాను. సినిమా కోసం ఎన్టీఆర్ రిస్క్ చేయక తప్పలేదు. సింహాద్రి అనంతరం సినిమా సినిమాకు ఎన్టీఆర్ బరువు పెరుగుతూ పోయాడు. ఆహార ప్రియుడు కావడంతో పాటు, సహజంగా బరువు పెరిగే స్వభావం ఆయన శరీరానికి ఉంది. 2006లో విడుదలైన రాఖీ సినిమా నాటికి ఎన్టీఆర్, అభిమానులు కూడా జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాడు.