హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,`క` సినిమాను ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి. థియేటర్స్ దగ్గర పోటీ ఉంది. మా అందరికీ "క" సినిమాపై సినిమాపై నమ్మకం ఉంది. ఈ రోజు ఆడియెన్స్ చాలా ఎంపికగా థియేటర్స్ కు వెళ్తున్నారు. కంటెంట్ నచ్చితేనే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. మా మూవీ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్త కంటెంట్ మూవీలో ఉండబోతోంది అనే వైబ్ క్రియేట్ అయ్యింది.
కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి "క" సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. తమిళంలో సహా అన్ని భాషల్లో ఈ నెల 31నే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాం. సినిమా 70వ దశకం నేపథ్యంతో పీరియాడిక్ కథతో సాగుతుంది. కాబట్టి యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు, మీ ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలుంటాయి. "క" సినిమాలో జాతర సాంగ్ కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది` అని అన్నారు.
ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు.