అది ఒక్కోసారి హీరోలకు తలనొప్పిగా మారుతుంది. అభిమానులు కొన్ని సందర్భాల్లో హీరోలకు ఆంక్షలు కూడా పెడుతుంటారు. మీరు అది చేయాలి, ఇది చేయొద్దని సూచనలు చేస్తారు. ఇక హీరోలకు అభిమానుల మనోభావాలు చాలా ముఖ్యం. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందే. లేదంటే పొగిడిన నోటితోనే తిడతారు కూడా. ఫ్యాన్స్ సెంటిమెంట్స్ కి వ్యతిరేకంగా హీరోలు కూడా ఏమీ చేయరు.
టాలీవుడ్ లో కృష్ణ అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పోటీ పడిన ఏకైన స్టార్ కృష్ణ మాత్రమే. ఆయన సినిమా విడుదల అంటే థియేటర్స్ కి జనాలు పోటెత్తేవారు. కృష్ణకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కాగా కృష్ణ రెండో కుమార్తె మంజుల హీరోయిన్ కావాల్సింది. ఓ స్టార్ హీరోకి జంటగా ఆమె నటించాల్సి ఉండగా... అభిమానులు ఒప్పుకోలేదు.