Pawan Kalyan
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం. కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా నియమింపబడ్డారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. కాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 56వ ఏట అడుగుపెడుతున్నారు.
Pawan Kalyan
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఈ మధ్య స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి పాత సినిమాలు రీరిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఈ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ చిత్రాల్లో ఏది రీరిలీజ్ చేస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే మూవీని థియేటర్స్ లోకి తెస్తున్నారు.
Pawan Kalyan
గబ్బర్ సింగ్ చిత్రాన్ని సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ స్పెషల్ పోస్టర్ సైతం విడుదల చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. అప్పటి వరకు పరాజయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది.
హిందీ సూపర్ హిట్ మూవీ దబంగ్ రీమేక్ గా గబ్బర్ సింగ్ రూపొందించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు నేటివిటీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దబంగ్ చిత్రానికి భారీగా మార్పులు చేశాడు. హరీష్ శంకర్ తెరకెక్కించిన సన్నివేశాలు, రాసిన వన్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి. అందుకే చాలా కాలంగా ఈ కాంబినేషన్ ని అభిమానులు కోరుకుంటున్నారు. ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలో పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న చిత్రాల షూటింగ్స్ పూర్తి చేస్తారని సమాచారం. మొదటగా ఆయన ఓజీ సెట్స్ లో జాయిన్ అవుతారట. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు సైతం ఆయన పూర్తి చేయాల్సి ఉంది.