టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో..పుష్ప సినిమాతో బన్నీకి ఇండియా వ్యాప్తంగా వచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఇమేజ్ ను రెట్టింపు చేసుకునేందుకు ఇంకా కష్టపడుతున్నాడు అల్లు అర్జున్. అందుకోసమే పుష్ప2ను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. టైమ్ సరిపోలేదని ఈమూవీ రిలీజ్ ను కూడా అగస్ట్ నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు.
మెగా నీడ నుంచి వచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్ తో పాటు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సాధించాడు అల్లు అర్జున్. స్టార్ హీరోల లిస్ట్ లో పేరు సంపాదించాడు. కాగా బన్నీ ప్రస్తుతం పుష్పసినిమాతో పాటు.. ముందు ముందు కూడా వరుసగా పాన్ఇండియా కథలను సెలక్ట్ చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. మహేష్ బాబు తన సినిమాఓపెనింగ్స్ కు తాను వెళ్ళడు.. అది ఆయన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న సెంటిమెంట్. కాగా అలాంటి సెంటిమెంట్స్ అల్లు అర్జున్ కు కూడా ఉన్నాయట. బన్నీకి ఇలాంటివి రెండు సెంటిమెంట్లు ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అవి తన సినిమాలో ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడట అల్లు అర్జున్.
ఇంతకా ఆ రెండు సెంటిమెంట్లు ఏంటంటే.. అందులో ఒకటి ఏప్రిల్ సెంటిమెంట్. ఏప్రెల్ నెలలో తన సినిమాలు రిలీజ్ అయితే హిట్ వస్తుందని ఆయన నమ్ముతాడట. అందుకే కుదిరితే చాలా వరకూ తన సినిమాలు ఏప్రిల్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తాడట. అలాగని నిర్మాతను , డైరెక్టర్ ను డిమాండ్ చేస్తూ.. ఇబ్బంది పెట్టే అలవాటు ఐకాన్ స్టార్ కు లేదు. కుదిరితేనే ఈ సెంటిమెంట్ అంటున్నాడు బన్నీ.
Allu Arjun
ఇక ఆయన ఫాలో అయ్యే మరో సెంటిమెంట్.. బన్నీకి వైజాగ్ అంటే ఇష్టమట.. సెంటిమెంట్ కూడాను. అందుకే తన సినిమాల్లో ఒక్క సీన్ అయినా.. వైజాగ్ లో తీసేలా ప్లాన్ చేస్తాడట. డైరెక్టర్ కు అదే విషయం చెపుతాడట. సినిమా పరిస్థితిని బట్టి.. దర్శకుడు విశాఖ పట్నంలో ఒక్క షెడ్యూల్ అయినా జరిగేలా చూస్తారని సమాచారం.
ఇలా అల్లు అర్జున్ రెండు సెంటిమెంట్లు ఫాలో అవుతాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కాని.. ఫ్యాన్స్ లో కూడా ఈవిషయంపై డిస్కర్షన్ జరిగినట్టు తెలుస్తోంది.