చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ అంటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ.. గంగోత్రి, బాలు చిత్రాల్లో నటించిన చిన్నది అంటే... ఆ చిట్టి పాపా.. అని ఇట్టే కనిపెట్టేస్తారు. తేనె కళ్ళు, పాల బుగ్గలతో క్యూట్ గా ఉండే కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా 12 చిత్రాల వరకూ చేశారు. మసూద చిత్రంతో కావ్య హీరోయిన్ గా మారబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కావ్య నటి సంగీతతో పాటు ఆలీతో సరదాగా షోకి వచ్చారు.