జమున సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన మొదటి చిత్రం పుట్టిల్లు. ఈ చిత్రం 1953లో విడుదలైంది. మిస్సమ్మ, పూజాఫలం, గుండమ్మ కథ, లేత మనసులు, మూగ మనసులు వంటి చిత్రాలు జమునకు స్టార్డం తెచ్చాయి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో వందల చిత్రాల్లో నటించింది. మూడు దశాబ్దాల పాటు ఆమె ప్రస్థానం సాగింది.
కాగా జమున సెకండ్ హ్యాండ్ కారు కొని చిక్కుల్లో పడిందట. భారీగా నష్టపోయిందట. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే జమున కారు మీద మనసు పడిందట. ఆరు చిత్రాల్లో నటించిన జమున.. తన తండ్రితో కారు కొందాము నాన్న, అన్నారట. స్థోమతకు మించిన భారం. ఇప్పుడే కారు అవసరమా... వద్దని జమునకు తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట.