నన్ను అలా పిలవకని మహేష్ బాబును లైవ్ లో హెచ్చరించిన డేరింగ్ పర్సన్, అసలు ఏం జరిగింది?

First Published | Nov 12, 2024, 9:24 PM IST

ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో పాటు పాల్గొన్న ఓ ఫేమస్ పర్సనాలిటీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నన్ను అలా పిలవకు అంటూ మహేష్ కి ముఖాన చెప్పాడు. 
 

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ బాబు ఒకరు. ఆయన ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 

కాగా మహేష్ బాబును మాజీ సీఎం కొడుకు అలా పిలవకు అని లైవ్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. ఆ మాజీ సీఎం కొడుకు ఎవరో కాదు కేటీఆర్.  భరత్ అనే నేను మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో కేటీఆర్, మహేష్ బాబు, కొరటాల శివ పాల్గొన్నారు. ఫస్ట్ ఈ ఈవెంట్ కి హాజరైన కేటీఆర్ సర్ కి ధన్యవాదాలు అని మహేష్ బాబు అన్నారు. 


వెంటనే అందుకున్న కేటీఆర్...  నన్ను సర్ అని పిలవకు, రామ్ అంటే చాలు. మరోలా పిలిచినా పర్లేదు. సర్ అని పిలిస్తే నేనేదో వయసులో మీ కంటే పెద్దోడ్ని అని అనుకుంటారు, కావాలంటే డైరెక్టర్(కొరటాల శివ) ని సర్ అని పిలుచుకోండి అని అన్నారు. కేటీఆర్ మాటలకు మహేష్ బాబు ఒకింత షాక్ అయ్యారు. 


ఇంకా మహేష్ బాబు మాట్లాడుతూ.. కేటీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన సినిమా బాగుంటే చెప్తారు లేదంటే చెప్పరు. ఆగడు మూవీ చూసి నాకు ఫోన్ చేసి తిట్టారు. ఇలాంటి చెత్త చిత్రాలు చేయకండి, అన్నారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. 

అంత హానెస్ట్ గా కేటీఆర్ తన అభిప్రాయం వ్యక్తపరుస్తారు. నా మూవీ విడుదలైతే, కేటీఆర్ రెస్పాన్స్ ఏమిటనే ఒక భయం ఉంటుంది. ఇక భరత్ అనే నేను మూవీలో నా రోల్ డిజైన్ చేయడంలో కేటీఆర్ ని స్ఫూర్తిగా తీసుకున్నాం. కేటీఆర్ లైఫ్ స్టైల్ కి కొంచెం దగ్గరగా, భరత్ అనే నేను మూవీలో నా క్యారెక్టర్ ఉంటుంది, అన్నారు. 

Bharat Ane Nenu

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సూపర్ హిట్. ఈ చిత్రంలో మహేష్ బాబు సీఎంగా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో చేసిన బెస్ట్ మూవీస్ లో భరత్ అనే నేను ఒకటి. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. కొరటాల-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు, భరత్ అనే నేను మంచి విజయాలు సాధించాయి. 

రాజమౌళి-మహేష్ కాంబోలో మొదటి ప్రాజెక్ట్ గా ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే రాజమౌళి తెలియజేశారు. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందట 
 

Mahesh Babu and Rajamouli

స్క్రిప్ట్ వర్క్ కోసమే రెండేళ్ల సమయం తీసుకున్నారు. జనవరి నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం సరికొత్తగా సిద్ధం అవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జుట్టు, గడ్డం పెంచాడు. ఎస్ఎస్ఎంబి 28లో మహేష్ ఎలా కనిపించనున్నాడనే ఆసక్తి పెరిగిపోయింది. 

రెండేళ్లకు పైగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ జరగనుందని సమాచారం. ఇండియా వైడ్ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. ఎస్ఎస్ఎంబి 29తో మహేష్ బాబు పాన్ ఇండియా బరిలో దిగనున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగతో మూవీ చేసే అవకాశం కలదు. 

Latest Videos

click me!