మోహన్‌ బాబు రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్‌ కొట్టిన చిరంజీవి, పాపం కలెక్షన్‌ కింగ్‌ తలపట్టుకున్న వేళ

First Published | Nov 12, 2024, 8:24 PM IST

మోహన్‌బాబు ఓ సూపర్‌ హిట్‌ సినిమాని మిస్‌ చేసుకున్నాడు. తాను రిజెక్ట్ చేయడంతో మెగాస్టార్‌ ఆ సినిమా చేసి హిట్‌ కొట్టాడు. తర్వాత తలపట్టుకోవం కలెక్షన్‌ కింగ్‌ వంతు అయ్యింది. మరి ఆ మూవీ ఏంటి?
 

సినిమా పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం కామన్‌గానే జరుగుతుంది. ఒకరికి నచ్చనిది మరొకరికి నచ్చుతుంది. ఊహించని విధంగా అవి సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అదే సమయంలో కొన్ని డిజాస్టర్‌ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. చిత్ర పరిశ్రమలో ఏదైనా జరుగుతుంది. అయితే మోహన్‌బాబు రిజెక్ట్ చేసిన సినిమాతో చిరంజీవి హిట్‌ కొట్టడం విశేషం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మోహన్‌బాబు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చాడు. విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోగా ఎదిగి, మళ్లీ విలన్‌గా మారి తానేంటో నిరూపించుకుని మళ్లీ హీరోగా, తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్‌లకు ధీటుగా రాణించాడు. విజయాలు అందుకున్నారు. అదే సమయంలో స్టార్‌ స్టేటస్‌ని పొందాడు. అయితే మోహన్‌బాబు తన వద్దకు వచ్చిన ఓ సినిమాని రిజెక్ట్ చేశారట. దీంతో అది చిరంజీవి వద్దకు వెళ్లిందట. ఆయన ఓకే చేశాడు, హిట్‌ కొట్టేశాడు. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో చూస్తే. 


ఆ సినిమా `హిట్లర్‌`. ఈ మూవీ మలయాళంలో మమ్ముట్టి నటించిన `హిట్లర్‌`కి రీమేక్‌. ఇందులో హీరోకి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారు. వాళ్ల కోసం అన్న పడే స్ట్రగుల్‌, వారికి అండగా నిలవడమనే ఓ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రం. అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో రీమేక్‌ చేయాలని భావించారు.

ఎడిటర్‌ మోహన్‌ దీనికి సంబంధించిన కసరత్తులు చేశారు. మోహన్‌బాబు అయితే బాగుంటుందని ఆయన్ని అప్రోచ్‌ కాగా, ఆయన రిజెక్ట్ చేశారు. అప్పటికే ఆయన ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో `వీడెవడండి బాబు` సినిమాకి కమిట్‌ అయ్యాడు. కామెడీ మూవీ కావడంతో బాగా వర్కౌట్‌ అవుతుందని ఆశతో ఉన్నాడు మోహన్‌బాబు. దీంతో `హిట్లర్‌`ని రిజెక్ట్ చేశారు. 

ఆ తర్వాత ఈ కథ చిరంజీవి వద్దకు వెళ్లింది. ఆయన అప్పటికే `బిగ్‌ బాస్‌`, `రిక్షావోడు` సినిమాల పరాజయంతో డౌన్‌లో ఉన్నాడు. ఈ రీమేక్‌ గురించి తెలిసి ఎగ్జైట్‌ అయ్యారు. కొత్తగా ఉంటుందని భావించి ఓకే చెప్పారట. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. దీనికి నటుడు ఎల్బీ శ్రీరామ్‌ డైలాగులు రాయడం విశేషం. 1997లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. చిరంజీవికి ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది. అయితే తెలుగులో కొంత మార్పు చేశారు. ఆ మార్పుకి ఆఫీస్‌ బాయ్‌ కారణమని చెబుతుంటారు. 

read more: రాజమౌళిపై భయంతో లైపోసక్షన్‌ చేసుకున్న స్టార్‌ హీరో? అంతగా అవమానించాడా?

ఈ సినిమాని రిజెక్ట్ చేసిన మోహన్‌బాబు `వీడెవడండి బాబు` మూవీతో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన తలపట్టుకున్నాడట. అనవసరంగా మంచి హిట్‌ సినిమాని మిస్‌ చేసుకున్నానని బాధ పడ్డాడట. కానీ ఇలాంటివి కామన్‌గానే జరుగుతాయని ఆ తర్వాత రిలాక్స్ అయిపోయారట. ఇక మోహన్‌బాబు చాలా గ్యాప్‌తో ఇప్పుడు `కన్నప్ప` సినిమాలో నటిస్తున్నారు.

మంచు విష్ణు మెయిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమాని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, కాజల్‌, శరత్‌ కుమార్‌ వంటి భారీ కాస్టింగ్‌ నటిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుందని సమాచారం. చిరంజీవి ఇప్పుడు `విశ్వంభర` సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

అజిత్‌ మగాడేనా అంటూ సంచలనం రేపే కథనం, ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్ట్ కి తలా సాయం

Latest Videos

click me!