కళ్యాణి సినిమా
కన్నడ చిత్ర పరిశ్రమలోనే సంచలనం `కేజీఎఫ్`. ప్రశాంత్ నీల్ ఊహకు, యష్ ప్రాణం పోస్తే ఈ మూవీ అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు సంచలన విజయం సాధించి, అందరి చూపు కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తిప్పుకునేలా చేశాయి. అంతకు ముందు కన్నడ సినిమాలంటే రీమేక్ చిత్రాలనే కామెంట్ ఉండేది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను చాలా లేట్‌గా రీమేక్ చేస్తుంటారని అంటున్నారు. కానీ ఆ రూమర్స్ ని, ఆ కామెంట్లకి సమాధానం చెబుతూ `కేజీఎఫ్` వంటి సంచలనాన్ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్, యష్.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కెజిఎఫ్ సినిమా
సాధారణంగా రెండో భాగం(సీక్వెల్) ఫ్లాప్ అవుతుంటాయనే అభిప్రాయం కూడా ఉంది. కానీ 2022లో విడుదలైన `కెజిఎఫ్ 2` ఆ అభిప్రాయాన్ని బద్దలు కొట్టింది. కెజిఎఫ్ మొదటి భాగం కంటే దాని రెండవ భాగం అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఇది బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూలు చేసింది. కన్నడలోనే కాదు, తమిళం, తెలుగులో, నార్త్ లోనూ భారీ వసూళ్లని రాబట్టింది.
కెజిఎఫ్ యష్
కెజిఎఫ్ 2 చిత్రం విజయం తర్వాత 2 సంవత్సరాలు సినిమా చేయలేదు యష్. తనపై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో అలాంటి సినిమాతోనే రావాలని వెయిట్ చేశాడు. చివరకు `టాక్సిక్` అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో హీరో యష్‌కి అక్కగా నటి నయనతార నటిస్తోంది. `టాక్సిక్` చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతోంది. వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
కళ్యాణి రీమేక్‌లో యష్
కన్నడ చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన యష్, `కెజిఎఫ్` చిత్రంలో నటించడానికి ముందు 20కి పైగా చిత్రాలలో నటించారు. వాటిలో చాలా వరకు రీమేక్ చిత్రాలే. అందులో ఒకటి తమిళంలో విమల్, ఓవియా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం `కళ్యాణి`(కళావాణి). ఈ చిత్రం కన్నడ రీమేక్‌లోనే యష్ హీరోగా నటించారు. కెజిఎఫ్ వంటి మాస్ చిత్రంతో పాపులర్ అయిన యష్, `కళ్యాణి`(కళావాణి) వంటి చిన్న బడ్జెట్ చిత్రంలో కూడా నటించడం విశేషం. ఈ విషయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.