అజ్ఞాతవాసి, స్పైడర్ ని మించిన డిజాస్టర్..45 కోట్ల బడ్జెట్ పెడితే 70 వేలు మాత్రమే వసూలు చేసిన స్టార్ హీరో మూవీ

First Published | Jun 22, 2024, 1:27 PM IST

సరైన ప్రణాళికతో సినిమాలు నిర్మించకపోతే నిర్మాతలు తీవ్ర నష్టాలు ఎదుర్కోక తప్పదు. చేయాల్సిన ప్రయత్నం చేసి ఆడియన్స్ కి నచ్చకపోతే అది నిర్మాత తప్పు కాదు. కానీ సినిమానే సరిగ్గా నిర్మించగా ప్రేక్షకుల ముఖాన కొడితే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తారు.

The Lady Killer

సరైన ప్రణాళికతో సినిమాలు నిర్మించకపోతే నిర్మాతలు తీవ్ర నష్టాలు ఎదుర్కోక తప్పదు. చేయాల్సిన ప్రయత్నం చేసి ఆడియన్స్ కి నచ్చకపోతే అది నిర్మాత తప్పు కాదు. కానీ సినిమానే సరిగ్గా నిర్మించగా ప్రేక్షకుల ముఖాన కొడితే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితి బాలీవుడ్ లో ఓ క్రేజీ హీరో చిత్రానికి ఎదురైంది. 

బాలీవుడ్ ల్లో బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన అర్జున్ కపూర్ కెరీర్ విషయంలో ఎదురీదుతూనే ఉన్నాడు. బోనీ కపూర్ లాంటి అగ్ర నిర్మాత తనయుడిగా కావలసినంత గుర్తింపు ఉంది. అయినప్పటికీ అర్జున్ కపూర్ కి సక్సెస్ దక్కడం లేదు. 

Latest Videos


గత ఏడాది అర్జున్ కపూర్ నటించిన ది లేడీస్ కిల్లర్ అనే చిత్రం వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియదు. త్వరలో ఈ మూవీ ఓటిటిలోకి రాబోతుండడంతో చర్చల్లో నిలిచింది. దాదాపు 45 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజై ఇండియా వైడ్ గా సాధించిన వసూళ్లు కేవలం 70 వేలు మాత్రమే. 

ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతకంటే పెద్ద డిజాస్టర్ మూవీ ఇంకొకటి ఉండకపోవచ్చు. దీనికి నిర్మాతలు చేసుకున్న స్వయంకృతాపరాధం ఓ కారణం అయితే.. ప్రకృతి కూడా పేజీ పట్టింది. సినిమా సగం పూర్తయ్యాక ఇది వర్కౌట్ కాలేదని వదిలేశారు. అప్పటికే బడ్జెట్ 40 కోట్లు దాటేసింది. 

మిగిలిన బడ్జెట్ తో సినిమాని చుట్టేశారు. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించకుండానే వాయిస్ ఓవర్ లో చెప్పించారు. ఎడిటింగ్ లో మేనేజ్ చేశారు. దీనితో ప్రేక్షకులకి విషయం అర్థం అయిపోయింది. ఎలాంటి చిత్రాన్ని చూసేందుకు ఆడియన్స్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. తొలి రోజు ఇండియా మొత్తం ఈ చిత్రానికి కేవలం 290 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హీరోగా.. బోల్డ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నటించారు. అయినా కూడా ఆడియన్స్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. త్వరలో ఈ చిత్రం నెట్ ఫిక్స్ ఓటిటి లో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో భారీ డిజాస్టర్స్ అంటే అజ్ఞాతవాసి,స్పైడర్ లాంటి చిత్రాల పేర్లు వినిపిస్తాయి. ఇప్పుడు ది లేడీ కిల్లర్ సినిమా గురించి తెలుసుకుంటున్న వారు.. ది లేడీ కిల్లర్ తో పోల్చుకుంటే అజ్ఞాతవాసి, స్పైడర్ జుజుబీ లాంటి చిత్రాలు అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

click me!