Taapsee : తాప్సీ టాలీవుడ్ కు ఎందుకు దూరమైంది? రీజన్ ఇదేనా?

First Published | Jun 29, 2023, 4:29 PM IST

సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu)  తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ ఎందుకు దూరంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఓ న్యూస్ వైరల్ గా మారింది. 
 

టాలీవుడ్ లో ఒకప్పుడు ఊపూపిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. కొన్నాళ్లపాటు దుమ్ములేపిన ఈ భామ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏదోక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయినా పెద్దగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. 
 

ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తాప్సీ హీరోయిన్ గా మారింది. ఆమె తొలిచిత్రం ఇదే. టాలీవుడ్ లోనే ఫస్ట్ సినిమా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ చిత్రంలోని ‘ఏం సక్కగున్నవ్ రో’ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. తాప్సీ డాన్స్ , గ్లామర్ పరంగా ఈసినిమాతో ఫుల్ మార్కులు దక్కించుకుంది.


అయితే, పదేళ్ల కింద బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ నెమ్మదిగా తెలుగు చిత్రాలకు దూరమవుతూ వచ్చింది. ఇక్కడ సినిమాలు తగ్గించి హిందీ, తమిళంలో వరుస చిత్రాలతో అలరిచింది. ఇప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్ లోనే సందడి చేస్తోంది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. 
 

చివరిగా ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. గతేడాది రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా తాప్సీ  హిందీ, తమిళంలోనే బిజీగా ఉంది. దీంతో తెలుగు సినిమాలపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఇందుకు ఓ రీజన్ ఉందంటున్నారు. 

టాలీవుడ్ కు తాప్సీ దూరం కావడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం.. టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో కొడుకుతో తాప్సీ ప్రేమలో పడిందంట, కానీ పెళ్లి విషయం వచ్చే సరికి అతను హ్యాండ్ ఇచ్చాడంట. ఆ బాధను తట్టుకోలేక తాప్సీ ఇక్కడ ఉండలే బాలీవుడ్ కు వెళ్లిందంటున్నారు. 

ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరనేది తెలియదు. మరోవైపు ఇందులో ఎంత వరకు నిజం ఉందనేదీ స్పష్టంగా లేదు. కానీ ఇదే అసలు కారణం అంటూ స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తోంది. ఏదేమైనా తాప్సీ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. ‘వో లడ్కీ హే కహా, ‘డుంకీ’, ‘ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబా’ వంటి చిత్రాలు చేస్తోంది. తమిళంలో ‘జన గణ మన’, ’ఏలియన్’ సినిమాల్లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!